
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణ శివారులోని రంగనాయకులగుట్ట వద్ద గల పాటిమీద ఆంజనేయస్వామి జ్ఞాన సరస్వతి దేవాలయంలో శుక్రవారం వసంత పంచమి వేడుకలను వేద పండితులైన అర్చక స్వాములు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా జ్ఞాన సరస్వతి దేవికి ఆలయ అర్చకులు తిరునగరి తిరుమలేష్, కుర్చీ ప్రదీప్, కిరణ్ కుమార్, లలిత్ కుమార్ లు సరస్వతిదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు అమ్మవారి దీవెనలు అందజేశారు. ఈ సందర్భంగా దేవాలయ ఆవరణలో వందలాదిమంది భక్తులు తమ పిల్లలకు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. వసంత పంచమీ వేడుకలకు దేవాలయ కమిటీ అన్ని రకాల ఏర్పాట్లను చేశారు. ప్రతి ఏడాది ఏడాది వసంత పంచమీకీ వాటి మీద భక్తుల సంఖ్య పెరుగుతుండడం పట్ల స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ దేవాలయం వద్ద అక్షరాభ్యాసం చేసిన చిన్నారులు చదువులో ఎంతో చక్కగా రాణించడం ఆ సరస్వతి కృపకు పాత్రులవుతున్నట్లుగా భావిస్తున్నారు.

సరస్వతీ దేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న విద్యార్థులు, తల్లిదండ్రులు..

సరస్వతి దేవికి ప్రత్యేక పూజల అనంతరం సామూహిక అక్షరాభ్యాసం చేయిస్తున్న తల్లిదండ్రులతో చిన్నారులు..






