
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హనుమకొండ : టీయూడబ్ల్యూజే (ఐజేయూ) హనుమకొండ జిల్లా యూనిట్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల 2026 డైరీని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ఆవిష్కరించారు. శుక్రవారం హనుమకొండ సుబేదారిలోని కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారదిగా ఉన్న జర్నలిస్టుల పాత్ర గొప్పదని అన్నారు.జర్నలిస్టుల డైరీని తన చేతుల మీదుగా డైరీ ఆవిష్కరణ చేయడం సంతోషంగా ఉందన్నారు. మెరుగైన సమాజం కోసం ప్రతిఒక్కరు భాద్యతగా ఉండలని అందులో తానుకూడా ముందు వరుసలో ఉంటానని జిల్లా కలెక్టర్ తెలిపారు.ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గడ్డం రాజిరెడ్డి, తోట సుధాకర్లు మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో టీయూడబ్ల్యూజే (ఐజేయూ) ముందుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర హౌసింగ్, వెల్ఫేర్ కన్వీనర్ వల్లాల వెంకటరమణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి. వేణుమాధవ్, కంకనాల సంతోష్, ప్రెస్ క్లబ్ మాజీ అధ్యక్షుడు గడ్డం కేశవమూర్తి, జిల్లా కోశాధికారి బచ్చు పురుషోత్తం, జిల్లా ఉపాధ్యక్షులు ఉట్కూరి సాయిరాం, డాక్టర్ పొడిశెట్టి విష్ణువర్దన్, ఎంఏ నయీం, జిల్లా కార్యవర్గ సభ్యులు పులికంటి రాజేందర్, అల్లె రామారావు, ఎంఎ వాజీద్, తాళ్ల రవి, ఎండి. ఖాదర్ పాషా, నాయకులు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

టీయూడబ్ల్యూజే (ఐజేయూ) హనుమకొండ జిల్లా యూనిట్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల 2026 డైరీని ఆవిష్కరిస్తున్న హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్






