Oplus_16908288
– అందరికీ తాగు నీళ్ళు, వాడవాడన మురుగు కాలువలు, వీధిలైట్ల ఏర్పాటు, అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యం.!
– హుజురాబాద్ ను మామ సదానందం, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సహకారంతో సమగ్ర అభివృద్ధి చేస్తా అంటున్న బిఆర్ఎస్ నేత ప్రియాంక
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, జనవరి 24: త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో హుజురాబాద్ మున్సిపాలిటీ 12వ వార్డు నుండి బిఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలవాలని, తద్వారా చైర్మన్ పదవిని ఎలాగైనా కైవసం చేసుకోవాలని “తొగరు” కుటుంబం వ్యూహం రచిస్తున్నట్టు సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది. 2019లో జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో 12వ వార్డు ఎస్సీ జనరల్ స్థానం అయింది. ఇక్కడ బిఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎంపీపీ తొగరు సదానందంను బిఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో దింపారు. మంచి మెజారిటీతో గెలిచి కౌన్సిలర్ గా వార్డును అన్ని విధాలుగా తీర్చిదిద్దారు. వార్డు పరిధిలోని ముక్కపల్లి, కోళ్ల పారాల వద్ద సుమారు 60 నూతన విద్యుత్ పోల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కోళ్ల ఫారాల వద్ద అర్హులైన నిరుపేదలకు ఇళ్లపట్టాలు ఇప్పించడం జరిగింది. ప్రతి వాడలో మిషన్ భగీరథ పైప్ లైన్ వేయించి తాగునీటి ఎద్దడి లేకుండా శాశ్వత పరిష్కారం చూపడం జరిగింది. దీంతో ఆయనకు వచ్చిన మంచి పేరుతో ఇప్పుడు ఆయన కోడలు ప్రియాంకను బిఆర్ ఎస్ అభ్యర్థిగా ఇక్కడినుండే కౌన్సిలర్ గా పోటీ చేయించి గెలిచిన తర్వాత చైర్మన్ పదవిని కైవసం చేసుకోవాలని తొగరు సదానందం భావిస్తున్నట్టు తెలుస్తోంది. పట్టణంలో బీఆర్ఎస్ కి మంచి పట్టుంది. గత ఎన్నికల్లోను చెప్పుకోదగ్గ సీట్లను ఆ పార్టీ సంపాదించి చైర్మన్ పదవినీ కూడా కైవసం చేసుకున్నది విడతమే. అయితే 2021లో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో, 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పట్టణంలో మొదటి స్థానంలో నిలిచింది. దీనితో బీఆర్ఎస్ కు బలం పట్టణంలో అన్ని వార్డుల్లో పెరిగింది. ఈ కారణంగా అర్ధ బలం, అంగ బలం ఉన్న సదానందం గత కొద్దిరోజులుగా వార్డులోనే మకాం వేసి కౌన్సిలర్ స్థానం కైవసం చేసుకోవాలనే ప్రయత్నాలు ప్రారంభించారు. మున్సిపల్ పరిధిలో మొత్తం 30 వార్డులు ఉన్నాయి. అన్ని వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను బరిలో దింపి వారి గెలుపుకు అన్ని రకాలుగా సహకారం అందించి, చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకునే వ్యూహం చేస్తున్నారు. 2019కి ముందు కొత్తపల్లి గ్రామ పంచాయితీగా ఉన్నా ఆ తర్వాత మున్సిపాలిటీలో విలీనం అయింది. మునిసిపాలిటీలో విలీనం అయినప్పటికీ అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉండగా సదానందం వచ్చిన తర్వాత ఒక్కసారిగా రూపు రేఖలు మారిపోయాయి. ఈ ప్రాంతములో భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. వరంగల్ – కరీంనగర్ జాతీయ రహదారిపై ఈ గ్రామం ఉండడంతో శరవేగంగా అభివృద్ధి జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. ఈ వార్డు నుండే వరంగల్ – కరీంనగర్ హైవే ఉండడం, హుజురాబాద్ పట్టణంలోనీ 12వ వార్డులో తాగునీటి నీటి సమస్య పెద్దగా లేదు. కానీ పట్టణంలో పలుచోట్ల తాగు, సాగు నీటి ఎద్దడి ప్రతి వేసవిలో ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్నారు. ఇందుకుగాను తాను గెలిస్తే ఎస్సారెస్పీ కాకతీయ కాలువ ద్వారా మోడల్ చెరువును నింపేందుకు కృషి చేస్తామని తెలిపారు. 2019లో 12వ వార్డ్ కౌన్సిలర్ గా తొగరు సదానందం గెలిచి ఇందిరానగర్ బీసీ కాలనీ, ముక్కపల్లి, కోళ్ల ఫారాల వద్ద, వార్డులో ప్రతి వాడలో సీసీ రోడ్లు, మురుగు కాలువలు, వీధిలైట్లు ఏర్పాటు చేయడంతో పాటు అర్హులందరికీ పెన్షన్లు, ఇందిరమ్మ ఇండ్లు, కల్యాణ లక్ష్మి చెక్కులు, కోళ్ల ఫారాల వద్ద ఉండే పేదలకు ఇళ్ల పట్టాలు ఇప్పించడం జరిగింది. దీంతో కౌన్సిలర్ గా చేసిన అభివృద్ధి నేడు తిరిగి సానుభూతిగా మారడంతో తిరిగి ఆయన కోడలు ప్రియాంకను చైర్మన్ రేసులో ఉండే విధంగా పట్టణంలో అన్ని వర్గాలతో మంచి సంబంధాలు నెరిపేందుకు ఆయన ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. రిజర్వేషన్ ను బట్టి ఆయన కోడలును 12వ వార్డుల బరిలో దింపే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

బీఆర్ఎస్ నుండి కౌన్సిలర్ గా పోటీ చేసి.. చైర్మన్ గా బరిలో నిలుస్తా : బిఆర్ఎస్ నేత తొగరు ప్రియాంక
రాబోయే హుజురాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకుంటుందని, మునిసిపాలిటీపై గులాబీ జెండాను ఎగరేస్తామని ఆ పార్టీ నేత, కౌన్సిలర్ అభ్యర్థి తొగరు ప్రియాంక అన్నారు. 12వ వార్డులో గతంలో తన మామ గెలిచిన అనుభవంతో, ఈ సారి కూడా ఈ ఎన్నికల్లో రిజర్వేషన్ అనుకూలించినందున కౌన్సిలర్ గా బరిలో ఉంటామని తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో బలమైన కేడర్ బిఆర్ఎస్ పార్టీకి ఉందని గుర్తు చేశారు. మున్సిపల్ పరిధిలోని ప్రజలు ఈసారి బిఆర్ఎస్ ని కోరుకుంటున్నారని అన్నారు. యువత, మహిళలు, రైతులు, ఉద్యోగులు, నిరుద్యోగులు బిఆర్ఎస్ ని కోరుకుంటున్నారని, ముఖ్యంగా పట్టణ ఓటర్లు విద్యావంతులని, వారంతా బిఆర్ఎస్ కి అండగా నిలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. మునిసిపాలిటీని కైవసం చేసుకునేందుకు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు సహకారంతో అందరిని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతామని తెలిపారు. ఏ పార్టీకి లేని కార్యకర్తల బలం తమ పార్టీకి ఉందని, సైనికుల్లా పనిచేసే కార్యకర్తలు ఉన్నారని ఆమె అన్నారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ముఖ్యంగా 12వ వార్డు ఓటర్ల సహకారంతో తాను గెలిచి మున్సిపాలిటీని అన్ని రంగాలలో తీర్చిదిద్దుతానని ప్రియాంక చెప్పారు.




బిఆర్ఎస్ నేత, కౌన్సిలర్ అభ్యర్థి తొగరు ప్రియాంక





