Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: నేవీ అగ్నివీర్ లో ఆర్మీ సోల్జర్ గా ఎంపికైన యువకుడు సుంకరి భానుప్రకాష్ ను శనివారం హుజూరాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. సైదాపూర్ మండలం ఆరేపల్లి గ్రామానికి చెందిన సుంకరి భాను ప్రకాష్ సైన్యంలో చేరి దేశ సేవ చేయాలనే ఉద్దేశంతో నావీ అగ్నివీర్ ఎంపిక కోసం జరిగిన పరీక్షలో ఆర్మీ సోల్జర్ గా ఎంపికయ్యాడు. కాగా అతడిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, రిటైర్డ్ పిడి కొన్ని రాజిరెడ్డి, వాకర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎండి మతిన్, పాక సతీష్, డాక్టర్ చంద్రమౌళి, వేల్పుల ప్రభాకర్, సమ్మయ్య, పంజాల శ్రీధర్, డిష్ రమేష్, సాయి, దామోదర్, దశరథం తదితరులు పాల్గొన్నారు.

భాను ప్రకాష్ ను సన్మానిస్తున్న వాకర్స్ నాయకులు, సభ్యులు





