Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మున్సిపాలిటీకి జరిగే రెండవ సాధారణ ఎన్నికల్లో మొదటిరోజు బుధవారం 15 నామినేషన్లు అభ్యర్థులు దాఖలు చేసినట్లు బల్దియా కమిషనర్ ముసబ్ అహ్మద్ తెలిపారు. బుధవారం 6, 7, 13 ,14, 18, 22, 24, 26, 27, 29, 30 వార్డులలో ఒక్కొక్క నామినేషన్, 9, 15 వార్డుల్లో రెండు నామినేషన్లు దాఖలైనట్లు ఆయన తెలిపారు.

ఈరోజు హుజురాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 6వార్డు బిఆర్ఎస్అభ్యర్థి అయిన బండ సింధుజ మున్సిపల్ కార్యాలయంలో తన మొదటి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆమేతోపాటు 6 వార్డు ప్రజలు మరియు బిఆర్ఎస్ నాయకులు బండ సింధుజ తండ్రి తల్లి రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్ సువర్ణ కూడా పాల్గొనడం జరిగింది.





