
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్:
ఫిబ్రవరి 23న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఓసి జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన జాతీయ స్థాయి ఓసిల మహాధర్నాకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఓసి సామాజిక వర్గీయులు తరలి వచ్చి విజయవంతం చేయాలని ఓసి సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు పిలుపు నిచ్చారు. ఈమేరకు కేంద్ర మంత్రి బండి సంజయ్ నీ ఆదివారం కరీంనగర్ లోని వారి నివాసంలో ఓసి ఐకాస రాష్ట్ర నాయకులతో కలిసి మహాధర్నాకు మద్దతు తెలుపాలని ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రికలను పోలాడి రామారావు అందజేసి మహాధర్నాను విజయవంతం చేయాలని కోరుతూ ముద్రించిన గోడ ప్రతులను కేంద్ర మంత్రి బండి సంజయ్ తో ఆవిష్కరింప జేసి వారి నివాస ఆవరణలో ఓసి ఐకాస రాష్ట్ర, జిల్లాల ముఖ్య నాయకులతో కలిసి నిర్వహించిన సన్నాహక సమావేశంలో పోలాడి రామారావు మాట్లాడారు. రాజ్యాంగ బద్దంగా ఏర్పడ్డ 10శాతం ఈడబ్ల్యూఎస్ పై రాజకీయ పబ్బo కోసం కొన్ని దుష్ట శక్తులు ఆయా కులాల్లోని ప్రజలను మభ్య పెడుతూ చేస్తున్న అసత్య ప్రచారాలు, పన్నుతున్న కుట్రలను సాగనివ్వబోమని హెచ్చరించారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పటిష్ట అమలుకు ఓసిల స్థితి గతుల అధ్యయనానికి
జాతీయ స్థాయిలో చట్టబద్ధతతో కూడిన ఓసిల కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ఈడబ్లూస్ సర్టిఫికెట్ జారీకి వార్షిక ఆదాయ పరిమితిని 10 లక్షలకు పెంచాలని, ఈడబ్ల్యూఎస్ కోటాకు కేటాయించిన మిగిలిపోయిన బ్యాక్ లాగ్ పోస్టులను ఈడబ్ల్యూఎస్ వారితోనే భర్తీ చేయాలని డిమాండ్ రామారావు చేశారు.

ముద్రించిన గోడ ప్రతులను కేంద్ర మంత్రి బండి సంజయ్ తో ఆవిష్కరింపజేస్తున్న ఓసి జెసి జాతీయ అధ్యక్షుడు రామారావు, ఇతర నాయకులు..
ఓసిలకు నేటికీ రాజకీయ రిజర్వేషన్లు లేకపోవడం వల్ల జనరల్ స్థానాల్లో కనీసం 15 శాతం సీట్లు కూడా గెలుచుకోలేక తీవ్రంగా నష్టోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతమున్న 50 శాతం మించకుండా ఉన్న రిజర్వేషన్లలో ఓసిలకు కూడా రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.
రైతు భీమా వయోపరిమితి 70ఏళ్లకు పెంచాలని, రైతులకు ప్రస్తుత గిట్టుబాటుధర ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేదని, రైతు తాను పండించిన పంటకు రైతులే గిట్టు బాటు ధర నిర్ణయించే భాగస్వామ్యం కల్పించే ప్రత్యేక చట్టం తీసుకు రావాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లేందుకు జాతీయ ఓసి జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 23న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే వివిధ ఓసి సామాజిక వర్గీయుల నాయకులు విద్యార్థి, యువజనులతో నిర్వహించే జాతీయ స్థాయి ఓసిల మహాధర్నాకి రాజకీయాల కతీతంగా ఓసిలు రాష్ట్ర వ్యాప్తంగా అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని రామారావు కోరారు. ఈ సందర్భంగా మహా ధర్నాకు సంబంధించిన రవాణా వసతుల కల్పన, ధర్నా శిబిరం బాధ్యతలు రావుల నరసింహారెడ్డి, గంగు ఉపేంద్రశర్మ, తాడిశెట్టి పశుపతి, రొంటాల కేశవరెడ్డి, కన్న కృష్ణ, గట్టు మహేష్ బాబు, జనగామ కరుణాకర్ రావులతో కూడిన సమన్వయ కమిటిని జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు ప్రకటించారు. ఈ సమావేశంలో ఓసి జేఏసీ జాతీయ ప్రథాన కార్యదర్శి గట్టు మహేష్ బాబు, జాతీయ ఉపాధ్యక్షులు రొంటాల కేశవ రెడ్డి, కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఆర్యవైశ్య సంఘాల ఐక్య వేదిక అధ్యక్షుడు కన్న కృష్ణ, రాష్ట్ర సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘాల అధ్యక్షుడు నారాయణరెడ్డి, ఉమ్మడి జిల్లా బ్రాహ్మణ సంఘం సంఘాల అధ్యక్షుడు కొత్తకొండ రవీందర్ రావు, నాయకులు బైర్నేనీ శంకర్ రావు, కర్క రాజిరెడ్డి, అండెం రమణారెడ్డి, పున్నం మధుకర్ రెడ్డి, నీలకొండ రాంరెడ్డి, శంకరాచార్యులు, శ్రీ రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.









