
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:గత పదేళ్లుగా పార్టీ కోసం కష్టపడి, ఎన్నో అవమానాలు భరించి మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ ఆశించిన తనకు ఇవ్వకుండా హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఒడితల ప్రణవ్ బాబు వేరే పార్టీ నుండి కొన్ని నెలల క్రితం వచ్చిన వారికి టికెట్ ఇచ్చి తనకు అన్యాయం చేశాడని పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు యేముల పుష్పలత రోధిస్తూ ఆరోపించారు. శుక్రవారం హుజురాబాద్ మునిసిపల్ ఎన్నికల కౌంటింగ్ అనంతరం ఆమె మాట్లాడుతూ…. తన కుటుంబం మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉందని, పార్టీ అభివృద్ధి కోసం తాను తన కుటుంబ సభ్యులు ఎంతో పాటు పడ్డామని, పార్టీ ఎవరిని ఇక్కడికి నాయకుడిగా పంపిస్తే వారితో కలిసి పనిచేశానని కానీ ప్రణవ్ బాబు మాత్రం కాంగ్రెస్ నాయకుడు కౌర్ సుగుణాకర్ రెడ్డి మాటలు విని తాను పార్టీకి చెందిన ఎమ్మెల్సీ బల్మూరి వర్గం అని భావించి టికెట్ ఇవ్వకుండా మోసం చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. తన ఓటమి కోసం పార్టీ కావాలని కుట్ర పన్నిందని, పార్టీ కోసం పదేళ్లుగా కృషి చేస్తే నాకు ఇచ్చే బహుమతి ఇదా అని కన్నీళ్ల పర్యంతం అయింది. నా ఓటమికి, నన్ను అవమానించిన నాయకులందరికీ నా ఉసురు తాకుతుందని ఆమె ఆవేదనతో శాపనార్ధాలు పెట్టారు. ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ కండువతోనే నేను తిరిగానని, పార్టీ వ్యక్తులే తనను మోసం చేశారని తీవ్రంగా దుఃఖించింది. పార్టీని బ్రష్టు పట్టిస్తున్న కొంతమంది నాయకులపై పార్టీ అధిష్టానం చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. కాగా ఎన్నికల్లో ఆమె పరాజయం పొందడంతో కౌంటింగ్ హాల్ నుంచి తీవ్ర మనోవేదనతో వచ్చిన పుష్పలత కళాశాల మైదానంలో తన కుటుంబ సభ్యులతో కలిసి తీవ్రంగా దుఃఖించింది. అనంతరం స్పృహతప్పి పడిపోయింది. వెంటనే ఆమెను వైద్యాధికారులు డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ చందు, డాక్టర్ జరీనాలు పరీక్షించి కుదుటపడిన తర్వాత ఆమెను ఇంటికి పంపించారు.

తన పార్టీ వాల్లే తనకు మోసం చేశారని కన్నీళ్ళ పర్యంతం అవుతున్న కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి యేముల పుష్పలత.






