
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మున్సిపాలిటీలోని 18వ వార్డు ఎన్నికల ఫలితాలలో పొరపాట్లు జరిగాయని అధికారులు వెంటనే రికౌంటింగ్ జరగాలని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జమలుపూర్ రాణి డిమాండ్ చేసింది. ప్రభుత్వ జూనియర్ కళాశాల కౌంటింగ్ కేంద్రం వద్ద ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… కౌంటింగ్ సమయంలో అధికారులు నియమ నిబంధనలు పాటించలేదని, మొదట పోస్టల్ బ్యాలెట్లు 6 అని చెప్పారని ఇప్పుడేమో ఐదు అంటున్నారని ముందే తమ ఏజెంట్‌తో సంతకం పెట్టించుకున్నారని ఇది నిబంధనలకు విరుద్ధమని ఆమె అన్నారు. అన్యాయంగా, వివక్షపూరితంగా అధికారులు వివరించడం వల్ల తాను ఓడిపోయానని తనకు న్యాయం చేయాలని కన్నీళ్ల పర్యంతమైంది. ఈ విషయంపై తాను జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. కాగా నిబంధనల ప్రకారమే తాము వ్యవహరించామని దీనిలో ఎలాంటి తప్పు లేదని ఎన్నికల అధికారులు వివరణ ఇచ్చారు.

తనకు న్యాయం చేయాలని కన్నీళ్ళ పర్యంతమవుతున్న కాంగ్రెస్ అభ్యర్థిని జమల్పూర్ రాణి..





