
–కేసిరెడ్డి లావణ్య గెలుపు హుజూరాబాద్ లో సంచలనమే
ఒకే అభ్యర్థి వరుసగా నాలుగు సార్లు విజయం హుజురాబాద్ చరిత్రలో ఇదే ప్రథమం
– ఒకే పార్టీ, ఒకే వార్డు, ఒకే అభ్యర్థి..
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: మునిసిపల్ ఎన్నికల్లో హుజురాబాద్ 26వ వార్డులో బిఆర్ ఎస్ అభ్యర్థి కేసిరెడ్డి లావణ్య నరసింహారెడ్డి వరుసగా నాలుగో సారి గెలుపొందారు. శుక్రవారం వెలువడిన ఫలితాల్లో సుమారు 100 ఓట్ల మెజారిటీతో ఆమె గెలిచారు. ఆమె గతంలో మేజర్ గ్రామపంచాయతీ వార్డ్ మెంబర్ గా, నగర పంచాయతీ కౌన్సిలర్ గా, మునిసిపాలిటీ కౌన్సిలర్ గా మూడుసార్లు గెలుపొందారు. గతంలో 2006, 2014, 2020 ఎన్నికల్లో వరుసగా గెలుపొందారు. తాజాగా మరోసారి కూడా గెలవడంతో ఆమె నాలుగోసారి గెలిచినట్లయింది. నాలుగు సార్లు కూడా ఒకే పార్టీ, ఒకే వార్డు, ఒక్కరే అభ్యర్ధిగా ఆమె పోటీ చేశారు. నిజానికి కౌన్సిలర్ గా ఒకసారి గెలవడమే కష్టం. అలాంటిది నాలుగో సారి కూడా ఆమె గెలుపొందడం స్థానికంగా సంచలనం సృష్టించింది. ఈ సారి అధికార పార్టీలో లావణ్య లేరు, ఎలాగైనా లావణ్యను ఓడించాలని కాంగ్రెస్, బీజేపీలు గట్టి ప్రయత్నం చేశారు. ఒక్కటి రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ, మరోటి కేంద్ర ప్రభుత్వం పార్టీ ఈ రెండు పార్టీలకు చెందిన ప్రముఖ నాయకులు ధీన్ని గెలవాలని విశ్వ ప్రయత్నాలు చేసిన ఫలించలేదు, ఒకసారి కౌన్సిలర్ గా పని చేస్తేనే ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి వ్యతిరేకత ఉంటాయి. కానీ లావణ్య వాటిని అధిగమించింది. లావణ్య విజయం వెనుక ఆమె కృషితో పాటు ఆమె భర్త ప్రముఖ పాత్రికేయుడు కేసిరెడ్డి నరసింహారెడ్డి కృషి ఉంది. లావణ్య దంపతులు ప్రతినిత్యం ప్రజల్లో ఉండడం, నిరుపేదలకు చేదోడు వాదోడుగా ఉండడం, వార్డులో అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు, హరితహారం తదితర కార్యక్రమాలను నిర్వహించడం చేస్తుంటారు. ఎలాంటి గర్వం అహంకారం లేకుండా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటారనే పేరు ఉంది. ప్రతినిత్యం పారిశుద్ధ్యం పర్యవేక్షిస్తారు. వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దారు. సీసీ రోడ్లు డ్రైనేజీలు వంటి అభివృద్ధి పనులు చేశారు. వ్యాపార కేంద్రంగా ఉన్న 26 వార్డులో ప్రతినిత్యం కనిపిస్తారు. అందరినీ పలకరించడంతో పాటు ప్రతి ఒక్కరికి వారి కుటుంబంలో సభ్యులుగా మెదులుతారు. అలాగే తహసిల్దార్, మునిసిపల్, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో వార్డులో ప్రజలకు ఏ పని ఉన్న చేసి పెట్టే ప్రయత్నం చేస్తారు. అందువల్లనే వారు ప్రజల్లో పెద్దగా వ్యతిరేకతను ఎదుర్కోలేదు. లావణ్య నరసింహారెడ్డి దంపతులు మాజీ ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు, మాజీ ఎమ్మెల్యే వి సతీష్ కుమార్ కుటుంబానికి అత్యంత సన్నిహితులుగా ఉన్నారు. గతంలో ఈటెల రాజేందర్, ఇనుగాల పెద్దిరెడ్డి తదితర నేతలతో కూడా కలిసి పనిచేశారు. నాలుగో సారి గెలుపొందిన లావణ్య నరసింహారెడ్డిని పార్టీలకు అతీతంగా అందరూ అభినందిస్తున్నారు. నాలుగోసారి వరుసగా లావణ్య విజయం సంచలనం సృష్టించడమే కాకుండా స్థానిక రాజకీయ వర్గాల్లో పట్టణ ప్రజల్లో చర్చనీయాంశం అయింది. హుజురాబాద్ గ్రామ పంచాయతీలో ఇప్పటి వరకు మూడు సార్లు గెలిచిన అభ్యర్థులు ఉన్నారు కానీ నాలుగు సార్లు గెలిచిన అభ్యర్థిగా కేసిరెడ్డి లావణ్య చరిత్రక పుటల్లో నిలుస్తారనేది అక్షర సత్యం.


మద్దతు దారులతో కలిసి అంబేద్కర్ విగ్రహంకు పూలమాల వేసి దండం పెట్టి విజయ సంకేతం చూపెడుతున్న కేసిరెడ్డి లావణ్య నరసింహారెడ్డి..


గెలుపొందిన లావణ్య నరసింహారెడ్డిని అభినందనలతో ముంచేత్తుతున్న మద్దతుదారులు..


గెలుపొందిన లావణ్య నరసింహారెడ్డిని సత్కరిస్తున్న 26వ వార్డు ప్రజలు, అభిమానులు..

26వ వార్డులో గెలుపొందిన కేసిరెడ్డి లావణ్య..





