
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్ (హైదరాబాద్): ఓసిల న్యాయమైన డిమాండ్ల సాధనకు ఈ నెల 23న డిల్లీలో జాతీయ స్థాయిలో నిర్వహించే ఓసిల మహా ధర్నాకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు, అధికారుల అనుమతికూడా పొందినట్లు ఓసి సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తెలిపారు. ఈ మహాధర్నాకు రాష్ట్ర వ్యాప్తంగా ఓసి సామాజిక వర్గీయులు తరలి వచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ మేరకు డిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించ తలపెట్టిన జాతీయ స్థాయి ఓసిల మహా ధర్నాకు 5 ప్రత్యేక రైళ్లలో ఓసిలు కదలి వచ్చుటకు ఎక్కడికక్కడ స్వచ్ఛందంగా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఇందులో హైదరాబాద్ నుంచి ఒకటి, కాజీపేట నుంచి ఒకటి, విజయవాడ నుండి మరో రైలు లో వస్తున్నారని తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో ఓసి జేఏసీ జాతీయ రాష్ర్టనాయకులతో నిర్వహించిన సమావేశంలో పోలాడి రామారావు మాట్లాడారు. అగ్రవర్ణాల్లోని ఆర్ధికంగావెనుక బడి ఉన్నవారు రిజర్వేషన్లు లేమి కారణంగా అటు సంక్షేమ పథకాల ఫలాలు అందక, ఇటు రాజకీయ పదవులు పొందలేక పోతున్నారని అన్నారు. ఓటు బ్యాంక్ రాజకీయాలతో మున్సిపల్ వార్డు రిజర్వేషన్లలో ఓసిలకు తీవ్ర అన్యాయం జరిగి అవకాశాలు కోల్పోయారని మండిపడ్డారు. రాజ్యాంగ బద్దంగా ఏర్పడ్డ 10శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పై రాజకీయ పబ్బం కోసం కొందరు ఆయా కులాల్లోని ప్రజలను మభ్య పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుపేద ఓసి లు ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. జనరల్ స్థానాల్లో సైతం ఓసి లు తట్టుకోలేని పరిస్థితి నెలకొందన్నారు. హన్మకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీలో 16డివిజన్లు జనరల్ కేటగిరీకి రిజర్వు కాగా 12చోట్ల ఓసిలు పోటీ చేయలేక పోయారన్నారు. జనరల్ స్థానాల్లో కూడా ఓసిలకు రాజకీయ పార్టీలు అవకాశం ఇవ్వక పోవడం వల్ల రాజకీయంగానూ వెనుక బడి పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్ధికంగా వెనుకబడి ఉన్నవారికి చేయూతనిచేందుకు కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కల్పిస్తే వాటిపైనా దుష్ప్రచారం చేయడం తగదన్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పటిష్టంగా అమలు చేసేందుకు జాతీయ ఈడబ్ల్యూఎస్ కమిషన్ ఏర్పాటు చేయాలని రామారావు డిమాండ్ చేశారు. ఈడబ్ల్యూఎస్ బ్యాక్ లాగ్ పోస్టులను ఈడబ్లూఎస్ వారితోనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
అర్హతకు వార్షికాదాయ పరిమితి 10లక్షలకు పెంచాలని, అన్ని వర్గాల పేదలకు న్యాయం జరగడానికి రిజర్వేషన్లలో క్రిమి లేయర్ పద్ధతి కి రాజ్యాంగ సవరణ ద్వారా చట్టం తేవాలని రామారావు డిమాండ్ చేశారు. 50శాతం దాటకుండా ప్రస్తుతమున్న రిజర్వేషన్లలో ఓసి లకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. రైతులకు గిట్టుబాటు ధర నిర్ణయించే భాగస్వామ్యం కల్పించే ప్రత్యేక చట్టం తేవాలని రామారావు డిమాండ్ చేశారు.
రైతు భీమా వయోపరిమితి 70ఏళ్లకు పెంచాలని, జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగంతో అనుసంధానించి రైతులకు, రైతు కూలీలకు సహాయం చేయాలనే డిమాండ్లతో ఈనెల 23న డిల్లిలో 10వేల మంది తో ఓసి జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించే జాతీయ స్థాయి ఓసిల మహా ధర్నా ఒక చారిత్రాత్మకంగా నిలుస్తుందని రామారావు వెల్లడించారు. అనంతరం మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను శామీర్ పేటలో వారి నివాసంలో నాయకులతో కలిసి ఈనెల 23న డిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఓసి జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన జాతీయ స్థాయి ఓసిల మహాధర్నాకు మద్దతు ఇవ్వాలని కోరుతూ ఆహ్వాన పత్రంను ఓసి జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు అందజేయగా సానుకూలంగా స్పందించిన ఈటల రాజేందర్ కు ఓసి జేఏసీ తరపున పోలాడి రామారావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు .
…….. …….. …….. …………………….


తెలంగాణా జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నేతృత్వంలో ఏర్పడే ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీకి అన్నివర్గాల మద్దతు. పోలాడి రామారావు
…….. ……… ……
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర బహుజనుల ప్రయోజనాలు, అన్ని వర్గాల సంక్షేమానికి , తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి, తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవానికి ప్రతి రూపంగా అన్ని ప్రజా సంఘాలు, మేధావి వర్గం, కార్మిక, కర్షకులు, ఉద్యోగ, ఉపాద్యాయ, ఎన్జీవో లు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ, ఓసి వర్గాల యువజన, విద్యార్థి, మహిళా వర్గాల, ప్రస్తుత పార్టీల నుంచి అండర్ కవర్ గా ఉన్న అన్ని పార్టీల కొందరు నిఖార్సైన ముఖ్య నాయకులు, తెలంగాణ రాష్ట్ర ఉద్యమ జేఏసీ నాయకుల భాగస్వామ్యంతో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా ఏర్పడి రూపు దిద్దుకొని, సకల జనుల ఆమోదంతో ప్రత్యేక కార్యాచరణతో రాబోయే ఎన్నికల్లో కవిత ఆధ్వర్యంలో ఘన విజయం సాధించి అధికారం సాధించడం తథ్యమని ఈ పరిణామం కోసం యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నారని రామారావు స్పష్టం చేశారు. ప్రస్తుత రాజకీయ పార్టీలు స్వార్థ ఓటు బ్యాంక్ రాజకీయాలతో తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేయలేదని, ఎందరో విద్యార్థుల బలిదానాలు, అమరుల ప్రాణ త్యాగాల తో, సకల జనుల పోరాటాలతో, కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు కలలు కన్న బంగారు తెలంగాణకు బాటలు పడ లేదని, యువతకు విద్యా ఉపాధి అవకాశాలు కనుమరుగయ్యాయి, నీళ్ళు నిధుల, నియామకాల్లో సకల జనుల ఆకాంక్షలను వమ్ము చేశారని పోలాడి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దశలో ప్రత్యామ్నాయం వైపు అడుగులు ముందుకు పడటం అందుకు కల్వకుంట్ల కవిత ఇనిషియేటివ్ తీసుకోవడం స్వాగతించే శుభ పరిణామమని ఇందుకు మేమంతా సైనికులుగా కవితకు కొండంత అండగా ఉంటామని పోలాడి రామారావు పలువురు ప్రథాన పత్రికల ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా జర్నలిస్టులు పదే పదే అడిగిన అన్ని ప్రశ్నలకు, విస్పష్టంగా ముక్త సరిగా రెండు గంటల పాటు జరిగిన మీడియా సమావేశంలో పోలాడి రామారావు వివరించారు. ఈ సమావేశంలో పలువురు ఐకాస నాయకులు పాల్గొన్నారు.

మీడియా సమావేశంలో మాట్లాడుతున్న పోలాడి రామారావు..


ఓసిల మహాధర్నాకు మద్దతు ఇవ్వాలని ఎంపీ ఈటల రాజేందర్ ను కోరుతున్న జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..





