
–మ్యాచ్ ఫిక్సింగ్లా కనిపిస్తున్న హుజురాబాద్ ఎన్నికల ప్రక్రియపై నిష్పక్షపాత విచారణ జరపాలి
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: నిన్న హుజురాబాద్ కేంద్రంలో జరిగిన పరిణామాలు ప్రజాస్వామ్యంపై తీవ్రమైన అనుమానాలు కలిగిస్తున్నాయనీ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికల కౌంటింగ్ పూర్తికాకముందే కాంగ్రెస్ నాయకులు “మాకు ఇన్ని సీట్లు వస్తాయి” అని ముందుగానే ప్రకటించడం యాదృచ్ఛికం కాదు అని, ఎవరికెంత సీట్లు వస్తాయో ముందే చెప్పడం అంటే — ఇది సాధారణ రాజకీయ అంచనా కాదు, మ్యాచ్ ఫిక్సింగ్ జరిగినట్టే అనిపిస్తోంది అని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే — వారు ముందుగా చెప్పిన స్థానాలే చివరికి వారికి అనుకూలంగా రావడం, ఇది ప్రజల్లో అనుమానాలు పెంచుతోంది అన్నారు. స్ట్రాంగ్ రూమ్ తాళాలు పగలగొట్టడం, సీసీ కెమెరా ఫుటేజ్ తొలగించడం వంటి ఘటనలతో కలిపి చూస్తే — మొత్తం ప్రక్రియపై సందేహాలు మరింత బలపడుతున్నాయి అని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు. ఒక్క రోజులోనే తాళాలు పోయినవి అని ప్రచారం చేయడం వెనుక అధికారుల పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు అని అన్నారు.
ఒక్క పూట స్ట్రాంగ్ రూమ్ తాళం చెవిని కాపాడలేని అధికారులు ఉన్న తరుణంలో అందులో ఉన్న పోలింగ్ బాక్సులు భద్రంగా ఉన్నాయ అనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయన్నారు. నిష్పక్షపాతంగా పనిచేయాల్సిన ఎన్నికల కమిషన్ ఈ సంఘటనపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం పట్ల హుజురాబాద్ ఎమ్మెల్యేగా నేను తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాను అని అన్నారు.
ప్రజలు తరుపున అడుగుతున్నా పోలీస్ అధికారులు, ఎన్నికల యంత్రాంగం ఎవరి కోసం పనిచేస్తోంది? ప్రజల కోసమా లేదా ఒక పార్టీ కోసమా? కౌశిక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను ఎన్నికలు అంటే ప్రజల తీర్పు, ఆ తీర్పును ఎవరైనా ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తే అది ప్రజాస్వామ్యానికి ప్రమాదం అని అన్నారు
ఈ సంఘటనపై నేను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘంను గట్టిగా డిమాండ్ చేస్తున్నాను అని ఆయన తెలిపారు. ఈ మొత్తం ఘటనపై నిష్పక్షపాత విచారణ జరపాలనీ, స్ట్రాంగ్ రూమ్ ఘటనపై పూర్తి సీసీటీవీ డేటా రికవరీ చేయాలనీ, బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలనీ, అవసరమైతే ఈ ఎన్నికల ప్రక్రియపై పునర్విచారణ చేయాలనీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. హుజురాబాద్ ప్రజల హక్కుల కోసం నేను ఎప్పుడూ పోరాడుతాననీ, ప్రజల ఓటును ఎవరైనా దొంగిలించే ప్రయత్నం చేస్తే వారిని ప్రజల ముందుకు తీసుకొచ్చే వరకు నేను వెనక్కి తగ్గను అని కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు.





