
మండల యాదగిరి, స్వర్ణోదయ ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలో గడిచిన వారం రోజులుగా పదికి పైగా ద్విచక్ర వాహనాలు చోరీకి గురైనట్లు పలువురు వాహనదారులు పేర్కొన్నారు. నిన్న ఒక్కరోజే పట్టణంలో నాలుగు చోట్ల ద్విచక్ర వాహనాలు(స్ప్లెండర్ బైక్ లు)..ఎత్తుకెళ్లి దొంగలు హల్చల్ చేస్తున్నారు. ఇంటి ముందర పార్కింగ్ చేసిన వాహనాలను.. అల ఓకగా తీసుకెళ్తూ విద్యానగర్ లోని సీసీటీవీ కెమెరాలో కూడా చిక్కారు. అయితే పట్టణంలో కొన్ని ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు పని చేయకపోవడంతో ఇదే అదనుగా భావించి బైక్లను ఎత్తుకెళ్తున్నారు. ఇప్పటికే హుజురాబాద్ పట్టణంలో పదుల సంఖ్యలో ద్విచక్ర వాహనాలను దొంగలు చోరీకి పాల్పడుతుండడంతో హుజురాబాద్ ప్రాంత వాహన యజమానులు ఆందోళన చెందుతున్నారు. రాత్రి వేళలో గస్తీ నిర్వహించాల్సిన పోలీసులు నామమాత్రంగా గస్తీ తిరుగుతుండడంతో దొంగల పని ఈజీగా పూర్తి చేసుకున్నట్లుగా ఆరోపణలు కొలువెత్తుతున్నాయి. పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేస్తే పోలీసుల నుండి సరైన స్పందన కనిపించడం లేదని పలువురు బాధితులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించి ద్విచక్ర వాహనాల దొంగల ముఠా ఆట కట్టించాల్సిందిగా పట్టణ ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు.




ఇటీవల దర్జాగా చూరీకి గురవుతున్న ద్విచక్ర వాహనాలు..





