
–వారినీ ఘనంగా సన్మానించిన కమిషనర్.
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, ఫిబ్రవరి21: హుజురాబాద్ మునిసిపాలిటీ పరిధిలో ఆస్తి పన్ను వసూళ్లలో మూడు వార్డులు గడువు కంటే ముందే 100 శాతం లక్ష్యాన్ని సాధించి 30 వార్డులలో ఆ మూడు వార్డులు ప్రత్యేక గుర్తింపు పొందాయి. ఈ సందర్భంగా 100 శాతం వసూళ్లు పూర్తి చేసిన వార్డు అధికారులు ఖలీల్ మహమ్మద్, ఏల్పుల బాపు, బండ మోహన్ లను మునిసిపల్ కమిషనర్ సయ్యద్ ముసబ్ అహ్మద్, మేనేజర్ రావుల భూపాల్ రెడ్డి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఇల్లందుల రమేష్ లు వారిని కాలువతో ఘనంగా సన్మానించారు. నిర్ణీత గడువు కంటే ముందే పన్నులు వసూలు చేసి ప్రతిభ చూపడం పట్ల వారి కృషిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, ఇతర వార్డు అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

వార్డు అధికారి బండ మోహన్ ను ఘనంగా సన్మానిస్తున్న కమిషనర్, మేనేజర్, ఆర్ ఐ లు

వార్డు అధికారి ఏల్పుల బాబును సన్మానిస్తున్న కమిషనర్, మేనేజర్, ఆర్ ఐ లు..

వార్డు అధికారి ఖలీల్ మహమ్మద్ ను సన్మానిస్తున్న అధికారులు..





