Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో జమ్మికుంట పట్టణంలో BRS పార్టీ గెలిచి SC (G)చెర్మన్ కాగా వైస్ చైర్మన్ ముస్లిం సోదరుడికి పదవి ఇచ్చి గౌరవించామని చెప్పుకుంటున్న హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మున్సిపల్ చైర్మన్ గాని వైస్ చైర్మన్ గా గాని మైనార్టీ వర్గానికి ఎందుకు ఇవ్వలేదని, అంటే మీ నాయకుడు అయినా K T R కు మైనర్టీల మీద ప్రేమ లేదు అని నువ్వు బహిరంగంగా ఒప్పుకున్నట్లేనా అని..కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ మైనార్టీ నాయకుడు ఎండి ఇమ్రాన్ నిలదీశారు. ఆదివారం అయిన విలేకరులతో మాట్లాడుతూ..

కాంగ్రెస్ గెలిచిన హుజురాబాద్ పట్టణ మున్సిపాలిటీలో సీనియర్ మైనార్టీ సోదరులు ఉన్నప్పటికీ ఒక్కరికి కూడా వైస్ చైర్మన్ పదవి ఇవ్వలేదు అని అనే హక్కు ఎమ్మెల్యేకు గాని బిఆర్ఎస్ నాయకులకు గాని లేదన్నారు. ఎందుకంటే గత ఐదేళ్ల మున్సిపల్ పాలనలో కనీసం కో ఆప్షన్ మెంబర్ ను కూడా నియమించే సోయిలేని ఎమ్మెల్యే ఇప్పుడు మైనార్టీలపై కాపట ప్రేమ నటించడం ప్రజలు గుర్తించాలన్నారు.
కాంగ్రెస్ పార్టీ కేవలం మైనార్టీలను రాజకీయాలకు వాడుకుంటుందనే దానిలో వాస్తవం లేదన్నారు. మైనార్టీ సోదరులను తగిన విధంగా గుర్తించి అన్ని విధాలుగా ప్రాధాన్యత కల్పిస్తున్నదే కాంగ్రెస్ పార్టీ అన్నది ప్రజలు గమనించాలన్నారు. రాజకీయాల కోసం కులమతాలను వాడుకుని గట్టెక్కేదాకా ఒక మాట ఆ తర్వాత మరో మాట మాట్లాడే కౌశిక్ రెడ్డిని ప్రజలు గమనిస్తున్నారని, ఆయన ఆరోపణలకు ప్రజలే భవిష్యత్తులో తగిన గుణపాఠం చెబుతారని ఇమ్రాన్ పేర్కొన్నారు.

విలేకరులతో మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గం మైనార్టీ నాయకుడు ఎండి ఇమ్రాన్..





