Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: మాజీ కేంద్ర విద్యా శాఖ తొలిమంత్రి స్వర్గీయ మౌలానా అబుల్ కలాం వర్ధంతి వేడుకలు 17వ వార్డు కౌన్సిలర్ మహమ్మద్ ఖలీద్ హుస్సేన్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ముందుగా మైనార్టీ పాఠశాలలో అబుల్ కలాం చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. భారత స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిగా అబుల్ కలాం అందించిన సేవలు వెలకట్టలేని అని అన్నారు. ఆయన తీసుకున్న సాహసోపేతమైన చర్యలు దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి అన్నారు. ఆయన భారతదేశానికి విద్యాశాఖ మంత్రిగా అందించిన సేవలను గుర్తుచేసుకొని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో 17వ వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎండి ఇమ్రాన్, ఆశు, కార్యకర్తలు, మైనార్టీ విద్యార్థులు పలువురు పాల్గొన్నారు.







