
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: జనాభాలో సగానికి పైగా ఉన్న మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారని, మహిళా సాధికారత తోనే అభివృద్ధి సాధ్యమవుతుందని హుజురాబాద్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పద్మ సాయిశ్రీ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఆదివారం హుజురాబాద్ పట్టణంలో పోలీస్ శాఖ, ఆర్టీసీ, మున్సిపల్ కార్యాలయం, టాప్ర ఆధ్వర్యంలో, పిరమిడ్ స్ప్రిచ్యువల్ సొసైటీ ఆధ్వర్యంలో వేర్వేరుగా మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. హుజురాబాద్ పట్టణంలోని సిటీ సెంట్రల్ ఫంక్షన్ హాల్ లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన మహిళా మణులకు సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి పద్మ సాయిశ్రీ మాట్లాడుతూ….నాటి కాలంలో మహిళలను అబలలుగా భావించేవారని కానీ నేటి యుగంలో మహిళలు అన్ని రంగాల్లో ముందుండి సబలులుగా మారారని అన్నారు. నేటి తరంలో మహిళలు రాష్ట్రపతిగా, గవర్నర్ గా, టీచరుగా డాక్టర్ గా, శాస్త్రవేత్తగా, రాజకీయ నాయకురాలిగా ఎదిగారని అన్నారు. మహిళ ఒక కుటుంబంలో తల్లిగా చెల్లిగా అక్కగా భార్యగా అనేక పాత్రల్లో ఒదిగిపోతూ ఆ కుటుంబ అభివృద్ధికి తోడ్పడుతుందన్నారు. అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి వీణ ప్రణతి మాట్లాడుతూ… మహిళలు తమ కృషితో సమాజంలో ఎంతో ఎత్తుకు ఎదిగారని అన్నారు. అనంతరం హుజురాబాద్ ఏసిపి వాసంశెట్టి మాధవి మాట్లాడుతూ….కుటుంబ అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకం అని, ఆమె మూలంగానే ఆ కుటుంబం ముందుకు సాగుతుందని అన్నారు. మహిళలు సమాజంలో కొన్ని రకాలైన వివక్షతలకు గురవుతున్నారని పోలీస్ శాఖ మహిళలకు అండగా షి టీములను ఏర్పాటు చేసిందని అన్నారు. మహిళలకు ఎక్కడ హక్కులకు భంగం వాటిల్లిన వెంటనే చట్ట ప్రకారం రక్షణ పొందే పరిస్థితి ఉందన్నారు. మైనర్లపై ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చిన వారి హక్కులకు భంగం వాటిలిన ఫోక్సో చట్టం ఉందని వివరించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తులకు, డాక్టర్ స్వరూపరాణి, చైర్ పర్సన్ రొంటాల సుహాసిని, ఎస్సై స్వాతితో పాటు ప్రజా ప్రతినిధులను, మహిళా ప్రముఖులను సన్మానించారు.


–ఆర్టీసీ డిపోలో….
హుజురాబాద్ ఆర్టీసీ డిపోలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మహిళా కండక్టర్ విజయను డి ఎం రవీంద్రనాథ్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అలేఖ్య, ఎస్బిఐ సారయ్య పలువురు మహిళా ఉద్యోగులు కార్మికులు పాల్గొన్నారు.

—మున్సిపల్ కార్యాలయంలో…..
హుజురాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఆదివారం మహిళా దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా చైర్పర్సన్ రోoటాల సుహాసిని మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు సొల్లు సునీత, బండ వెన్నెల, మేకల స్వరూప, సందమల్ల పుణ్య, కోయల్ కార్ భారతి, అధికారులు పాల్గొన్నారు.


—టాప్ర ఆధ్వర్యంలో….
తెలంగాణ ఆల్ పెన్షనర్స్ , రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.
ఈ సందర్భంగా కౌన్సిలర్లు సొల్లు సునీత కేసిరెడ్డి లావణ్య, కొండా ప్రశాంతి అంగన్వాడీ టీచర్ కోటోజు జ్యోతి రాణి బింగి సుజాత లను ఘనంగా టా ప్ర జిల్లా అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో చీకట్లో సమ్మయ్య, సందేల వెంకన్న , బింగి కరుణాకర్, వెంకటయ్య హరికిషన్, వీరస్వామి బుచ్చిరాజం రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
—పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో….
అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు పిరమిడ్ స్పిరచ్యువల్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం విఎల్ఆర్ ఫంక్షన్ హాల్ లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా










మాట్లాడుతున్న ఏసిపీ వి మాధవి..





