
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని పలు వీధుల్లో వీధి కుక్కలతో ఇబ్బంది పడుతున్న ప్రజల బాధలు నివారించడానికి సోమవారం హుజూరాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ రొంటాల సుహాసిని ఆధ్వర్యంలో అధికారులు రెస్క్యూ టీమ్ సభ్యులతో కుక్కలను పట్టించారు. పలు వీధుల్లో వీధి కుక్కల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అవి కలవడం వల్ల అనేకమంది గాయాల పాలవుతున్నారని పలు ఫిర్యాదులు రావడంతో స్పందించిన చైర్పర్సన్ సుహాసిని రెస్క్యూ టీమ్ ను పిలిపించారు. వారు 17వ వార్డులోని మామిళ్ల వాడాలోని పలు ప్రాంతాల్లో వీధి కుక్కలను పట్టుకుని వెళ్లారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసబ్ అహ్మద్, కౌన్సిలర్లు ఎండి కాలిక్ హుస్సేన్, సొల్లు సునీత, మేనేజర్ భూపాల్ రెడ్డి, సానిటరీ ఇన్స్పెక్టర్ బి కిరణ్, ఎన్విరాన్మెంట్ అధికారి వినయ్, పలువురు సిబ్బంది పాల్గొన్నారు.

వీధి కుక్కలని పట్టుకుంటున్న ప్రత్యేక రెస్క్యూటిము పరిశీలిస్తున్న చైర్ పర్సన్, కౌన్సిలర్లు..





