
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని జమ్మికుంట రోడ్ లో సావిత్రిబాయి పూలే 129వ వర్ధంతి వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పూలే కమిటీ అధ్యక్షులు ఇప్పలపల్లి చంద్రశేఖర్, కమిటీ సభ్యులు సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ..
స్త్రీ విద్య కొరకు ఎన్నో అవమానాలను చీత్కారాలను అగ్రకుల బ్రాహ్మణుల నుండి ఎదుర్కొని స్త్రీ విద్యతోపాటు స్త్రీ జనోద్దరణకు తన జీవితాన్ని ధారబోసిన వీరవనిత సావిత్రిబాయి పూలే అని, ఎల్లప్పుడూ ప్రజల గుండెల్లో ఒక దేవత మూర్తిగా కొలువై ఉంటారని, నే డు స్త్రీలు విద్య ఉద్యోగ రాజకీయ రంగంలో పురుషులతో పాటు సమానంగా అన్నింట ముందడుగు వేయడానికి సావిత్రిబాయి కృషి ఫలితమే అన్నారు. ఈ కార్యక్రమంలో పూలే కమిటీ గౌరవ అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్, మండలం ఉప సర్పంచ్ల ఫోరం కన్వీనర్ వన్నాల శివాజీ, పూలే కమిటీ గౌరవ అధ్యక్షుడు సందేల వెంకన్న, సాగర్, శ్రీనివాస్, సమ్మయ్య, రాజేందర్, గోస్కుల మధుకర్, తిరునగరి రమేష్, దేవునూరి బాబు, దివిటి సురేష్, బాబు, సమ్మయ్య, ప్రవీణ్ కుమార్, క్రాంతి తదితరులు పాల్గొన్నారు.

సావిత్రిబాయి పూలే చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న వివిధ సంఘాల నాయకులు..





