
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్(హైదరాబాద్):
ఖమ్మం జిల్లా వెలుగు మెట్ల లోపోలీసు ల పహారాలో రెవెన్యూ అధికారులు కనీసం నోటీసు ఇవ్వకుండా అక్రమంగా 600 పేద కుటుంబాల ఇల్లు కూల్చి వేసి నిలున నీడలేకుండా చేయడం రాష్ట్రంలో రైజింగ్ పాలన కాదు బుల్డోజర్ డిస్ట్రక్షన్ పాలన నడుస్తూ తాలి బన్ల పాలన గుర్తుకు వస్తుందని వెలుగు మెట్ల ను చీకటి మెట్లగా మార్చారని రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

జాగృతి ఆఫీసులో కవితక్కకు మద్దతుగా పాల్గొని మాట్లాడుతున్న జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..
వెలుగొట్ల భూభాడుతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ జాగృతి ఆఫీసులో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేస్తున్న నిరవధిక నిరాహార దీక్ష శిబిరాన్ని నాయకులతో కలిసి పోలాడి రామారావు సందర్శించి కల్వకుంట్ల కవితకు ఓసి రైతు ప్రజాసంఘాల జేఏసీ తరపున పోలాడి రామారావు మద్దతు తెలిపి సంఘీభావంగా దీక్షా శిబిరంలో కూర్చున్నారు.
అనంతరం మీడియా ప్రతినిధులతో పోలాడి రామారావు మాట్లాడుతూ భూదాన్ భూముల ద్వారా సంక్రమించిన 30 ఎకరాల భూముల్లో 600 పేద కుటుంబాలు ఇల్లు నిర్మించీకొని ఏళ్లుగా నివసిస్తుంటే 250 కోట్లు బిలువ చేసే అట్టి భూములపై కన్నేసిన అధికార పార్టీ నేతల వల్లే ఇట్టి పేదల ఇళ్లను కూల్చి వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, కూల్చిన చోటే బాధితులకు నూతన ఇల్లు నిర్మించి ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల పరిహారం అందించాలని రామారావు డిమాండ్ చేశారు.
స్పందించిన కవిత ఖమ్మం వెల్లి బాధితులకు బాసటగా నిలబడితే అక్రమంగా కవితను సమీప పోలీసు స్టేషన్ కి తీసుకెళ్ళి 6 గంటల పాటు స్టేషన్ లో ఉంచడంతో కవిత నిరాహార దీక్షకు దిగుతే పోలీసుల అక్రమంగా అరెస్టు చేసి హైదారాబాద్ కు తరలించడంతో కవిత ఇంటి వద్దనే గత మూడు రోజులుగా చేస్తున్న నిరవధిక దీక్షకు మద్దతుగా తండోప తండాలుగా అన్నీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నాయకులు పెద్ద ఎత్తున తరలి వచ్చి కవితకు మద్దతుగా సంఘీభావం తెలిపారన్నారు.
అధికార పార్టీ నాయకులు నామ్ కే వస్తేగా బాదిత కుటుంబాలను పరామర్శించి సోషల్ సర్వే అని బకాయించడాన్ని తప్పు పడుతున్నట్లు రామారావు తెలిపారు. రాష్ర్టంలో ప్రతిపక్ష నాయకులు కనుచూపు మేరలో కనిపించడం లేదని ప్రథాన పక్ష పక్షంగా తామే వ్యవహరించి పేదలకు అండగా ఉంటామని పోలాడి రామారావు తెలిపారు. రామారావు వెంట చాకిళం రమణయ్య, ఉమ్మడి వరంగల్ జిల్లా ఓసి ఐకాస రాష్ట్ర కార్యదర్శి జనగామ కరుణాకర్ రావు, తదితరులు పాల్గొన్నారు.

హైదరాబాదులో జాగృతి అధ్యక్షురాలు కవితక్కకు మద్దతుగా మీడియా సమావేశంలో మాట్లాడుతున్న ఓసి జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..





