

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్ మార్చి13 : పట్టణంలోని 29వ వార్డులో మున్సిపల్ చైర్పర్సన్ రొంటాల సుహాసిని, 29 వ వార్డు కౌన్సిలర్ బోరగాల మొగిలి శుక్రవారం పర్యటించారు. వార్డు పరిధిలోని అంగన్వాడీ కేంద్రాన్ని, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను వారు సందర్శించి, అక్కడ అందుతున్న సేవలను క్షుణ్ణంగా పరిశీలించారు.
ముందుగా అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన చైర్పర్సన్, కేంద్రంలోని వంటగదిని మరియు నిల్వ ఉంచిన సరుకులను తనిఖీ చేశారు. గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు, చిన్న పిల్లలకు ప్రభుత్వం నిర్ణయించిన మెనూ ప్రకారం పౌష్టికాహారం సక్రమంగా అందుతుందో లేదో లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. “చిన్నారుల ఆరోగ్యం విషయంలో రాజీ పడకూడదని, ప్రతిరోజూ మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారాన్ని అందించాలని” ఆమె ఈ సందర్భంగా అంగన్వాడి టీచర్, సిబ్బందికి సూచించారు.
అనంతరం స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించి, విద్యార్థులకు వడ్డిస్తున్న మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించారు. వంటశాల పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని, విద్యార్థులకు రుచికరమైన భోజనాన్ని వడ్డించాలని వంట మనుషులకు దిశానిర్దేశం చేశారు. ఉపాధ్యాయులతో మాట్లాడి విద్యార్థుల విద్యా ప్రమాణాల గురించి అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు బోరగాల కవిత, స్వర్ణలత, అంగన్వాడీ సూపర్వైజర్, టీచర్ రొంటాల పద్మ, ఆర్పీలు బోరగాల రమ, ఎర్ర వినోద, ఆశా వర్కర్ వసంత తదితరులు పాల్గొన్నారు.


ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు బోధించిన పాఠ్యాంశాలను పరిశీలించి, విద్యార్థులను అడిగి తెలుసుకుంటున్న చైర్పర్సన్ సుహాసిని, కౌన్సిలర్ ముగిలయ్య..


అంగన్వాడి సెంటర్ ను సందర్శించి రిజిస్టర్ ను పరిశీలిస్తున్న మున్సిపల్ చైర్పర్సన్ సుహాసిని, కౌన్సిలర్ మొగిలయ్య..

పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలిస్తున్న చైర్పర్సన్, కౌన్సిలర్ లు…





