
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: వేసవిలో ప్రజలకు విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన నిరంతర విద్యుత్తు అందించేందుకు చర్యలు తీసుకున్నామని వరంగల్ చీఫ్ ఇంజనీర్(ఆపరేషన్)బి అశోక్ తెలిపారు. విద్యుత్ సరఫరాతో మెరుగుపరిచేందుకై హుజురాబాద్ 33/11 కేవీ ఉపకేంద్రంలో అదనంగా 5 ఎంవీఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ ను శుక్రవారం ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో వరంగల్ చీఫ్ ఇంజనీర్ (ఆపరేషన్), బి అశోక్ , కరీంనగర్ సూపరింటెండింగ్ ఇంజనీర్ (ఆపరేషన్), వి గంగాధర్, డివిజనల్ ఇంజనీర్ (ఆపరేషన్), డివిజనల్ ఇంజనీర్ (కన్స్ట్రక్షన్), ADE లక్ష్మారెడ్డి, పలువురు ఇంజనీర్లు సిబ్బంది పాల్గొన్నారు.
ఈ అదనపు ట్రాన్స్ఫార్మర్ అమరికతో హుజురాబాద్ పట్టణంలో విద్యుత్ లోడ్‌ను సమతుల్యం చేసి వినియోగదారులకు మరింత విశ్వసనీయమైన, మెరుగైన నిరంతర విద్యుత్ సరఫరా అందించడానికి దోహదపడుతుందనీ ఉన్నతాధికారులు తెలిపారు.

అదనంగా 5 ఎంవీఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ ను ఏర్పాటు చేయగా సిబ్బంది అభినందించి వారితో గ్రూప్ ఫోటో దిగిన వరంగల్ చీఫ్ ఇంజనీర్ (ఆపరేషన్), బి అశోక్ , కరీంనగర్ సూపరింటెండింగ్ ఇంజనీర్ (ఆపరేషన్), వి గంగాధర్, డివిజనల్ ఇంజనీర్ (ఆపరేషన్), డివిజనల్ ఇంజనీర్ (కన్స్ట్రక్షన్), ADE లక్ష్మారెడ్డి, పలువురు ఇంజనీర్లు..





