Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణ శివారులోనీ గణేష్ నగర్ లో ఏర్పాటు చేయాలని సంకల్పించిన డంపింగ్ యార్డును అడ్డుకోవాలని కోరుతూ శుక్రవారం ప్రజా సంఘాల నాయకులు మున్సిపల్ చైర్పర్సన్ రోంటాల సుహాసినికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… హనుమకొండ జిల్లా మడికొండలో ఏర్పాటు చేసే డంపింగ్ యార్డ్ ను
అక్కడ ప్రజలు వ్యతిరేకిస్తే అక్కడి నుండి హుజురాబాద్ లో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించిందన్నారు. ఒకవైపు కరీంనగర్ లో ఉన్న డంపింగ్ యార్డ్ ను తొలగించాలని అక్కడి నాయకులు ఎంపీ, మంత్రులు ఆదేశిస్తున్నారని కానీ హుజురాబాద్ లో నూతనంగా డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు ప్రభుత్వం ముందుకు వస్తుందన్నారు. డంపింగ్ యార్డ్ గణేష్ నగర్ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతం వాతావరణం పూర్తిగా దెబ్బతింటుందని, నీరు, గాలి కలుషితమైపోతుందని అన్నారు. వీటిని పీల్చుకోవడం వల్ల ప్రజలకు శ్వాసకోశ వ్యాధులు క్యాన్సర్ లాంటి వస్తాయని అన్నారు. ఇప్పటికైనా ప్రజల ఆరోగ్యం బాగుపడడం కోసం ఈ ఈ ప్రాంత వాతావరణం కలుషితం కాకుండా ఉండేందుకు డంపింగ్ యార్డ్ ఏర్పాట్ ను రద్దు చేయడం కోసం మున్సిపాలిటీ తీర్మానం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో
ప్రజా సంఘాల నాయకులు పల్కల ఈశ్వర్ రెడ్డి,
వేల్పుల రత్నం, గూడూరు స్వామిరెడ్డి, ముచ్చ సమిరెడ్డి
తునికి సమ్మయ్య, మట్టెడ ప్రకాష్, పి సహదేవ్, భద్రయ్య, బిక్షపతి, సతీష్, స్వామి, వేల్పుల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

మున్సిపల్ చైర్పర్సన్ సుహాసినికి వినతిపత్రం ఇస్తున్న ప్రజా సంఘాల నాయకులు..





