
–మూల్యం చెల్లించుకుంటారా.. రైతన్నల మనసు గెలుచుకుంటారా!
–నభూతో నభవిష్యత్ అనే రీతిలో కరీంనగర్ గర్జన సదస్సు నిర్వహిస్తాం
–దీక్షాశిబిరం నుండి పోలాడి రామారావు
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఎంతటి ప్రభుత్వమైనా.. ఎంత మెజారిటీ ఉన్నను.. అన్నదాతలను విస్మరించినట్లయితే.. రైతన్నలచే కన్నీరు పెట్టించినట్లయితే ఆ ప్రభుత్వాలు కుప్పకూలడం ఖాయమని… ఇది చరిత్ర చెబుతున్న సత్యమని రైతు ప్రజా సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షులు పోలాడి రామారావు, సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి హెచ్చరించారు. వచ్చేనెల అనగా ఏప్రిల్ 28వ తేదీన ఉద్యమాల గడ్డగా ప్రసిద్ధి గాంచిన కరీంనగర్ నగరంలో లక్ష నుండి లక్షన్నర మంది రైతన్నల సమక్షంలో మహా గర్జన సమరభేరి నిర్వహించడానికి సన్నాహాలు ఇప్పటికే మొదలుపెట్టినామని.. దాదాపు ఇటీవల గెలిచిన 200 మంది సర్పంచులతో కరీంనగర్ గర్జన సదస్సు సంబంధించి కీలక చర్చలు చేశామని…నూతన సర్పంచుల సలహాలు సూచనలను నివేదిక రూపంలో తయారు చేయడం జరిగిందని రామారావు వెల్లడించారు. వ్యవసాయదారులు ఎదుర్కొంటున్న సవాలక్ష సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి… నిర్ణీత గడువులోగా వాటిని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ వరంగల్ హైవే మధ్యలో హుజురాబాద్ అంబేద్కర్ కూడలి వద్ద శనివారం ఉదయం రైతు ప్రజా సంఘాల నాయకుడు ముచ్చ సమ్మిరెడ్డి నిరవధిక నిరాహార దీక్షకు పూనుకోవడం జరిగిందని.. ఆయన దీక్షకు మద్దతుగా హుజురాబాద్, జమ్మికుంట, కమలాపూర్, ఇల్లంతకుంట, వావిలాల, వీణవంక, చల్లూరు, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, సైదాపూర్, శంకరపట్నం, మానకొండూర్, హసన్ పర్తి, తదితర ప్రాంతాల నుండి పార్టీలకు అతీతంగా అన్నదాతలు పెద్ద ఎత్తున దీక్ష శిబిరానికి తరలివచ్చి మద్దతు తెలిపారని రైతు ప్రజా సంఘాల సమాఖ్య సైతం సమ్మిరెడ్డి దీక్షకు మద్దతు తెలపడం జరుగుతున్నదని పోలాడి ప్రకటించారు. అంతకుముందు వరంగల్ రోడ్ బస్ డిపో కార్నర్ నుండి ఎడ్లబండి పై అన్నదాతల కేరింతల మధ్య ముచ్చ సమ్మిరెడ్డి పోలాడి రామారావు తో కలిసి అంబేద్కర్ కూడలి వద్ద ఏర్పాటుచేసిన నిరాహార దీక్ష శిబిరానికి చేరుకొని తన దీక్షను ప్రారంభించారు. దీక్ష శిబిరాన్ని సందర్శించిన అనంతరం


పోలాటి రామారావు, సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామితో కలిసి మాట్లాడుతూ అన్నదాతలు పండిస్తున్న పంటలపై ప్రస్తుతం అమలు జరుగుతున్న గిట్టుబాటు ధరలు అన్నదాతలకు ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేనే లేవని తెలిపారు. పండించిన పంటలకు రైతులే గిట్టుబాటు ధరలను నిర్ణయించుకునే అవకాశం కల్పించే విధంగా జాతీయస్థాయిలో ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రస్తుత పరిస్థితులలో కూలీల కొరత తీవ్రంగా ఉందని.. ఖర్చులు విపరీతంగా పెరిగి ప్రతికూల వాతావరణ పరిస్థితులలో వ్యవసాయ రంగానికి చేయూత నిచ్చేందుకు.. అలాగే గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి అవకాశాలు పెంచేందుకు.. వ్యవసాయ రంగాన్ని చేయడంలో భాగంగా జాతీయ ఉపాధి హామీ పథకానికి వ్యవసాయ రంగాన్ని అనుసంధానం చేయాలని ఈ సందర్భంగా రామారావు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రైతు భీమా వయోపరిమితిని 70 ఏళ్లకు పెంచాలని.. ప్రతి రైతుకు నెలకు 6000 రూపాయల పెన్షన్ సౌకర్యం కల్పించాలని.. రైతులు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు 20 లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయం కల్పించాలని.. వివిధ ఓసి కార్పొరేషన్లను నామమాత్రంగానే ప్రకటించిన పాలకులు వాటికి నిధులు మరియు పాలక మండళ్లను నేటికీ ఏర్పాటు చేయలేదని.. అందువల్ల ఈ రెండింటిని తక్షణమే సమకూర్చాలని ఆయన డిమాండ్ చేశారు. ఆర్థికంగా వెనుకబడిన అగ్రకుల పేదల సంక్షేమం కోసం జాతీయ స్థాయి ఓసి కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 28వ తేదీన లక్షమంది అన్నదాతల సమక్షంలో కరీంనగర్ గడ్డపై రైతు గర్జన సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సదస్సుకు రావలసిందిగా పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరిని అన్ని జిల్లాల నుండి ఆహ్వానిస్తున్నామని…రాష్ట్రంలో ప్రతిపక్షమంటూ లేనేలేదని.. రైతు ప్రజా సంఘాల తరఫున తామే ప్రతిపక్ష పాత్ర బాధ్యతను స్వీకరించి అన్ని వర్గాల ప్రజల సమస్యలపై నిరవధిక పోరాటాలకు శ్రీకారం చుట్టడం ద్వారా ప్రభుత్వంలో చలనం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని రామారావు ప్రకటించారు. ముఖ్యంగా వ్యవసాయదారులకు.. కౌలు రైతులకు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని కోరారు. రైతు భరోసా నిధులను విడుదల చేయడంలో ప్రభుత్వం ఎందుకు విపరీతమైన జాప్యం చేస్తున్నదో అన్నదాతలకు సంజాయిషి ఇచ్చుకోవాలని అరటి బ్యాండ్ చేశారు. రైతు భరోసా నిధుల కోసం సమీకరించిన 9 వేల కోట్ల రూపాయల నుండి 4 వేల కోట్ల రూపాయలను కమిషన్లకు కక్కుర్తి పడి కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేయడం ద్వారా ఈ ప్రభుత్వం అన్నదాతల పొట్ట కొట్టిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పంట పెట్టుబడి సహాయం కోసం ఇవ్వవలసిన రైతు భరోసా నిధులు ఇప్పటికీనీ విడుదల విడుదల చేయలేదని.. మరో 15 రోజులలో పంటలు కోతకు వచ్చే తరుణం ఆసన్నమైందని.. ఇలాంటి పరిస్థితులలో ఇంకెప్పుడు రైతు భరోసా నిధులు మంజూరు చేస్తారో తెలియక అన్నదాతలు అయోమయానికి గురవుతున్నారని రామారావు పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే 16వ తేదీలోగా రైతు భరోసా నిధులను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో అసెంబ్లీని ముట్టడిస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో రైతులు కూలీలు యువత మహిళలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని.. పంటలకు సాగునీరు లేక అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ ప్రాజెక్టు నుండి ఏ విధంగా నీళ్లు తీసుకువచ్చి ఏ విధంగా ఇబ్బందులు తొలగించవచ్చునో… వాటర్ మేనేజ్మెంట్ ఎలా చేయవచ్చునో అనే మినిమం పరిజ్ఞానం కూడా తెలంగాణ రాష్ట్ర పాలకులకు లేకపోవడం దారుణం అన్నారు. పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో అక్కడ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వాటర్ మేనేజ్మెంట్ చేయడంలో దిట్ట అనిపించుకుంటున్నారని, అక్కడి పనితీరును మన పాలకులు చూసి నేర్చుకోవాలని, ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర అధికారులను ఆంధ్రకు పంపించి ఈ విషయంలో స్టడీ చేయించాలని పోలాడి సూచించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి, బీసీ గౌడ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బుర్ర శ్రీనివాస్ గౌడ్, పెన్షన్ సంఘాల ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్, రైతుమిత్ర ప్రజా సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు గూడూరి స్వామిరెడ్డి, ప్రధాన కార్యదర్శి చందుపట్ల నరసింహారెడ్డి, ఉపాధ్యక్షుడు కాశిరెడ్డి మహేందర్ రెడ్డి, రెడ్డి ఐక్య వేదిక రాష్ర్ట ప్రథాన కార్యదర్శి సంధి తిరుపతి రెడ్డి, ఓసి జేఏసీ రాష్ర్ట మహిళా కన్వీనర్, కంకణాల సరోజన,సీనియర్ నాయకులు రావుల భాస్కర్ రెడ్డి , రెడ్డి సంపత్ రెడ్డి, కళకుంట్ల సత్యనారాయణ రావు, ఉమ్మెంతుల శ్యాం సుందర్ రెడ్డి, రవీందర్ రావు, మనోహర్ శర్మ, రమణా రెడ్డి , పోతారం భాస్కర్, వ్వెంకటేశన్ ఓసి జేఏసీ రాష్ర్ట ఉపాధ్యక్షులు పెండ్యాల రాంరెడ్డి,యెన్నం కిషన్ రెడ్డి, అయిలేని మల్లిఖార్జున రెడ్డి, పోరెడ్డి శంతన్ రెడ్డి, ఎడవెల్లి కొందాల్ రెడ్డి, ఏనుగు చొక్కా రెడ్డి, జగిత్యాల ఆర్యవైశ్య సంఘాల జేఏసీ చైర్మన్ ఐత నాగరాజు., ప్రథాన కార్యదర్శి మహంకాళి రాజన్న,ప్రజా సంఘాల రాష్ట్ర నాయకులు కుమారస్వామి, వివిధ జిల్లాల వికాస మరియు ప్రజాసంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో ఈ దీక్ష శిబిరానికి హాజరై తమ మద్దతును ప్రకటించినట్లు రామారావు వెల్లడించారు.

సభను ఉద్దేశించి మాట్లాడుతున్న జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు పక్కన సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి తదితరులు..


శిబిరాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్న సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి..





