Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: రాష్ట్రంలోని రైతులకు ప్రభుత్వం వెంటనే రైతు భరోసా నిధులు విడుదల చేసి ఖాతాలో జమ చేయాలని ఓసి జెసి జాతీయ నాయకులు, బిఆర్ఎస్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎడవల్లి కొండారెడ్డి డిమాండ్ చేశారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో శనివారం ఓసి జెసి నాయకులు ముచ్చ సమ్మిరెడ్డి చేపట్టిన నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడారు. రైతు భరోసా ఇస్తామని హామీ ఇచ్చి.. ఇప్పటికే రెండు సీజన్ల రైతుబంధుకు ఎగనామం పెట్టారని ఆరోపించారు. వేసంగి పంటలు చివర దశకు వచ్చినప్పటికీ రైతు భరోసా నిధులు ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వం వెంటనే నిదులు విడుదల చేసి రైతులకు ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలన్నారు. రైతుల సమస్యలు పరిష్కరించాలని పోరాటాల గడ్డ హుజూరాబాద్ నుండి రైతు పోరాటం ప్రారంభమైందన్నారు. యూరియా కొనుగోలుకు యాప్ లింకు పెట్టడంతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని వెంటనే యాప్ తో సంబంధం లేకుండా రైతులు నేరుగా యూరియా కొనుగోలు చేసే విధంగా ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేయాలని కోరారు. లేని యెడల రాష్ట్ర వ్యాప్తంగా రైతు సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టి అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు.

మీడియాతో మాట్లాడుతున్న ఓసి జెసి జాతీయ నాయకులు, బిఆర్ఎస్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎడవల్లి కొండారెడ్డి..





