
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: పదవ తరగతి వార్షిక పరీక్షలు శనివారం హుజురాబాద్ డివిజన్ లో మొదటిరోజు తెలుగు పరీక్ష ప్రశాంతంగా జరిగాయి. హుజురాబాద్ పట్టణంలో 10వ తరగతి పరీక్ష రాసే విద్యార్థుల కోసం జిల్లా పరిషత్ సెకండరీ బాలుర పాఠశాల, జిల్లా పరిషత్ బాలికల సెకండరీ పాఠశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, మండలంలోని చెల్పూర్ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు హుజురాబాద్ ఎంఈఓ విడపు శ్రీనివాస్ తెలిపారు.
మొత్తం 821 విద్యార్థులకి గాను 819 మంది పరీక్షకి హాజరు కాగా ఇద్దరు గైర్హాజరు అయ్యారు అని ఆయన తెలిపారు. చెల్పూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 230 మంది, హుజురాబాద్ పట్టణంలోనీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 220 కి గాను 219 మంది, జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో 200 మంది, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో 171కి గాను 170 మంది హాజరైనట్లు ఆయన తెలిపారు. పరీక్ష కేంద్రాలను ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందం తనిఖీ చేశారు. పరీక్షలు ప్రశాంతంగా జరగడం కోసం పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.

పరీక్ష రాసేందుకు హాజరయ్యే విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్న అధికారులు..





