
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ప్రాంతంలో ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా జనావాసాల మధ్య నెలకొల్పే డంపింగ్ యార్డ్ ప్రాజెక్టును వెంటనే రద్దు చేయాలని హుజురాబాద్ మున్సిపల్ చైర్మన్ రొంటాల సుహాసిని నీ రైతు ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు డిమాండ్ చేశారు.
గత పది రోజులుగా హుజురాబాద్ ప్రాంతంలో డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా అఖిల పక్ష, వివిధ కుల ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలకు మద్దతుగా బుధవారం వేలాది మంది ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులతో అంబేద్కర్ కూడలి చౌరస్తాలో చుట్టూ అర కిలో మీటరుతో పాఠశాలల యాజమాన్యాల వారిచే మానవ హారం నిర్వహించారు. .
ఎలాంటి ప్రజాబిప్రాయ సేకరణ చేయకుండా జనావాసాల మధ్య ప్రాణ కోటికి, అన్నదాతల వ్యవసాయ రంగానికి జల వాయు కాలుష్యముతో నష్టం చేకూర్చే డంపింగ్ యార్డు ప్రాజెక్టు వెంటనే రద్దు చేయాలని పలువురు విద్యార్థినీ విద్యార్థులు డిమాండ్ చేస్తూ నిందించారు. రెండు గంటల సేపు వాహనాలు బారులు దీరి వాహనాల్లో వచ్చిన వారు సైతం ఈ ఆందోళనలకు మద్దతుగా సంఘీభావం తెలిపారు.



డంపు యార్డ్ వ్యతిరేక దీక్షలో కూర్చున్న మున్సిపల్ చైర్ పర్సన్ సుహాసిని, కౌన్సిలర్లు…
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ రోంటాల సుహాసిని మాట్లాడుతూ ఇట్టి డంపింగ్ యార్డ్ ప్రాజెక్టును రద్దు చేసే వరకు తాము సైతం ఉద్యమంలో పాల్గొంటున్నామని ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా. హుజురాబాద్ ప్రాంత సమీపంలో సిర్సపల్లి సరిహద్దు వద్ద జనావాసాల మధ్య నెలకొల్పే డంపింగ్ యార్డ్ ప్రాజెక్టును రద్దు చేయాలని మున్సిపల్ కౌన్సిల్ ఏకగ్రీవంగా తీర్మానించిందని తెలిపారు.

కాగా రైతు ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు మాట్లాడుతూ ప్రజాభిప్రాయాన్ని మన్నించి తక్షణమే డంపింగ్ యార్డు ప్రాజెక్టును విరమించుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని పోలాడి రామారావు హెచ్చరించారు.

దీక్షా శిబిరం వద్ద డంపింగ్ యార్డ్ కి వ్యతిరేకంగా ప్లకార్డ్లను ప్రదర్శిస్తున్న కౌన్సిలర్లు, వివిధ సంఘాల నాయకులు






