
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణ శివారులోని గణేష్ నగర్- సిరసపల్లి సమీపంలో ఏర్పాటు చేయతలపెట్టిన డంపింగ్ యార్డ్ ప్రాంతాన్ని మంగళవారం హుజూరాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ రొంటాల సుహాసిని, కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు సందర్శించారు. ఈ సందర్భంగా డంపింగ్ యార్డ్ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. డంపింగ్ యార్డ్ ఏర్పాటు వల్ల హుజురాబాద్ కు పరిసర ప్రాంతాలకు వచ్చే నష్టం గురించి చర్చించారు. హుజురాబాద్ మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్ రద్దు కోసం మొదటి
తీర్మానాన్ని ప్రవేశపెట్టిన అనంతరం చైర్పర్సన్, కౌన్సిలర్లు డంపింగ్ యార్డ్ ను సందర్శించడం ప్రాధాన్యత కలిగించింది. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఖాళీదు హుస్సేన్, జునూతుల భాస్కర్, తాళ్లపల్లి రమేష్, బొరగాల మొగిలి, గోస్కుల రాజకుమార్, నాంపల్లి శ్రీనివాస్, వి వెంకటేశ్వర్లు, చందమల్ల పుణ్య, వడ్లూరి శ్రీలేఖ, సొల్లు సునీత, కోయల్ కార్ భారతి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మేకల తిరుపతి, నాయకులు చందమల్ల బాబు, బండ నవీన్, కోయల్ కార్ బాలాజీ, స్థానిక రైతులు తదితరులు పాల్గొన్నారు.



కొత్తపల్లి- సిర్సపల్లి శివారులోని గుట్టలను డంపింగ్ యార్డ్ కు కేటాయించిన స్థలాన్ని పరిశీలిస్తున్న మున్సిపల్ చైర్ పర్సన్, పాలకవర్గ సభ్యులు..





