
–డంపింగ్ యార్డు ఏర్పాటుకు కాంగ్రెస్ వ్యతిరేకం
–చివరి ఆయకట్టు వరకు నీరందిస్తాం
–కాంగ్రెస్ ఇంచార్జి వి ప్రణవ్ బాబు.
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఎన్నికల ద్వారా గెలిచిన ప్రజా ప్రతినిధి ప్రజాసేవ కోసం పనిచేయాలి తప్ప తన వ్యక్తిగత ప్రతిష్ట కోసం దిగజారుడు మాటలు, అనుచిత ప్రవర్తన చేస్తున్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆ పదవికి అనర్హుడని అతడిని సస్పెండ్ చేయాలని హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఒడితల ప్రణవ్ బాబు డిమాండ్ చేశారు. గురువారం హుజూరాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ… ఎమ్మెల్యేగా ఎన్నికైన కౌశిక్ రెడ్డి ఎంతో హుందాగా వ్యవహరించాల్సి ఉండాల్సిందని, కానీ ఆ పదవికి తగ్గట్టుగా ప్రవర్తించకుండా దిగజారుడు వ్యవహారం చేయడం సిగ్గుచేటు అన్నారు. గవర్నర్ ను నిందించడం, వ్యాపారులను బెదిరించడం, పోలీసులపై ఇస్టారీతిన వ్యాఖ్యలు చేయడం, శాసనసభలో తోటి శాసన సభ్యుడిపై అనుచితంగా ప్రవర్తించడం సరైన పద్ధతి కాదన్నారు. తనపై ఎన్నో కేసులు ఉన్నాయని చెప్తున్నా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అది ప్రజల కోసం పెట్టిన కేసులని ఒక్క ఎఫ్ఐఆర్ అయినా చూపెట్టగలడా ఆని ప్రశ్నించారు. ఎథిక్స్ కమిటీ పూర్తి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
—డంపింగ్ యార్డ్ స్థల మార్పిడికి కట్టుబడి ఉన్నాం
ప్రజలకు నష్టం కలిగించే డంపింగ్ యార్డ్ ఏర్పార్టును కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుందని, ఈ ప్రాంతంలో కాక జనావాసాలు లేని మరో ప్రాంతానికి తరలించాలని ముఖ్యమంత్రికి ఇతర మంత్రులకు అధికారులకు తాను విన్నవించానని అన్నారు. డంపింగ్ యార్డ్ 2022లో ప్రతిపాదన వచ్చినప్పుడు ఎమ్మెల్సీగా ఉన్న కౌశిక్ రెడ్డి ఏం చేశాడో ప్రజలకు చెప్పాలన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి తాము డంపింగ్ యార్డ్ రాకుండా కృషి చేస్తున్నామని త్వరలోనే అది ఇతర ప్రాంతాలకు వెళుతుందని చెప్పారు. సమస్యను పక్కదారి పట్టయించకుండా రాజకీయాలకతీతంగా డంపింగ్ యార్డ్ పై పోరాటం చేయడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉందన్నారు. హుజురాబాద్ మున్సిపాలిటీ మొదటి తీర్మానం డంపింగ్ యార్డ్ రద్దుకు ఇవ్వడం తమ నిజాయితీకి నిదర్శనం అన్నారు. ఏ సమస్యనైనా తనకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నించడం, డైవర్షన్ పాలిటిక్స్ చేయడం కౌశిక్ రెడ్డికి బాగా తెలుసు అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా డంపింగ్ యార్డ్ ను రాకుండా చేయడంలో ముందుంటుందని చెప్పారు.

—చివరి ఆయకట్టుకు నీరందిస్తాం..
వరి పంటకు సరిపోయే విధంగా చివరి ఆయకట్టు వరకు నిరంధించేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రైతులు నీరందక ఇబ్బంది పడుతున్నారు అన్న విషయం తన దృష్టికి రాగా నీటిపారుదల శాఖ అధికారులతో మాట్లాడి మరికొన్ని రోజులు వారికి నిరంధించే విధంగా ప్రయత్నిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్ పర్సన్ రొంటాల సుహాసిని, వైస్ చైర్ పర్సన్ గూడూరి అంజలి, కౌన్సిలర్లు తాళ్లపల్లి రమేష్, వి వెంకటేశ్వర్లు, కాలిదు హుస్సేన్, సొల్లు సునీత, ఈ సమ్మయ్య, జి రాజకుమార్, నాయకులు మేకల తిరుపతి, వడ్లూరి విజయ్ కుమార్, తోగరు సదానందం, కొలిపాక శంకర్, పీ మల్లయ్య, టి రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఒడితల ప్రణవ్ బాబు





