
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ప్రజల ప్రయోజనం కోసం ప్రభుత్వం ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన వార్డు సభలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని హుజురాబాద్ మునిసిపల్ చైర్పర్సన్ రొంటాల సుహాసిని అన్నారు. గురువారం హుజూరాబాద్ మున్సిపల్ పరిధిలోని 30 వార్డుల్లో వార్డు సభలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయా వార్డుల్లో వార్డు కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసబ్ అహ్మద్, మేనేజర్ భూపాల్ రెడ్డి, ఆర్ఐ కిరణ్, టిపిఓ అశ్వినిగాంధీ, వార్డుల ప్రత్యేక అధికారులు, ఇతర సిబ్బంది వార్డు అధికారులు పాల్గొని ప్రజల నుండి వివిధ రకాల దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా దాదాపు అన్ని వార్డుల్లో డంపింగ్ యార్డ్ కు వ్యతిరేకంగా ప్రజలు వార్డు సభల్లో వినతి పత్రంలు అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వ కల్పిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరు అభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా చైర్పర్సన్, పాలకవర్గ సభ్యులు ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో అన్ని వార్డుల కౌన్సిలర్లు, అన్ని పార్టీల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. అయితే హనుమాన్ జయంతి నాడే హిందువుల అతి ముఖ్యమైన పండగ రోజున గ్రామసభలు పెట్టి ప్రజల మనోభావాలను దెబ్బతీశారని ప్రతిపక్ష పార్టీల నాయకులు ప్రభుత్వ తీరును విమర్శించారు.






వివిధ వార్డులలో ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులు..





