
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: హామీల అమలులో నిర్లక్ష్యం ఎందుకు అని, డిమాండ్ల సాధనకు రైతు ప్రజాసంఘాల ఐకాస కరీంనగర్ లో ఈ నెల 28న రెండు లక్షల మందితో రైతుల మహా గర్జన సమర భేరి సభ నిర్వహిస్తున్నట్లు రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తెలిపారు.
రైతు మహాగర్జనకు రావాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, పరకాల మాజీ ఎంఎల్ ఏ చల్లా ధర్మారెడ్డిలకు ప్రజాసంఘాల ఐకాస తరపున వినతి పత్రాలు అందజేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో ఎందుకు నిర్లక్ష్యం చూపుతుంది ?
అన్నదాతలకు విద్యార్థులకు వివిధ వర్గాల సమస్యలను ఎందుకు పట్టించుకోవడం లేదు అని రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు ప్రశ్నించారు.



ఈనెల 28 న కరీంనగర్ లో రెండు లక్షల మందితో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి రైతుల మహా గర్జన సమర భేరి సభకు హాజరు కావాలని కోరుతూ ప్రజా సంఘాల ఐకాస నాయకులతో కలిసి గురువారం మాజీ మంత్రి, మాజీ ఎంపీ ఎర్రబెల్లి దయాకర్ రావు, పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిలకు, అఖిల భారత పద్మ శాలి సంఘాల జేఏసీ చైర్మన్, వస్త్ర వ్యాపారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గూడూరి చంద్రశేఖర్ లను హన్మకొండలోని వారి వారి నివాసంలో పోలాడి రామారావు ఆహ్వాన పత్రికలను అందజేయగా
సభకు సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చి సభకు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో మహా గర్జన సమర భేరి సభకు పార్టీల కతీతంగా తరలి వచ్చి విజయ వంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా పోలాడి రామారావు మాట్లాడుతూ రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకొనే పాలకులు రైతుల సంక్షేమంపై ఇచ్చిన హామీల అమలులో ఎందుకు నిర్లక్ష్యం చేస్తోంది? వ్యవసాయానికి బడ్జెట్ కేటాయింపులు ఎందుకు తగ్గాయి?
రెండు లక్షల రుణ మాఫీలో అర్హులైన మిగతా 70 శాతం రుణమాఫీ ఎందుకు పూర్తి చేయడం లేదు ?
కౌలు రైతులకు ఇచ్చిన హామీలు ఎక్కడ అని నిలదీశారు.
ఇప్పటికే రెండు సార్లు ఎగ్గొట్టిన రైతు భరోసా నిధులను సర్కార్ ఎందుకు పూర్తి స్థాయిలో విడుదల చేయడం లేదు ? అన్ని పంటలకు రూ 500 బోనస్ ఇస్తామని ఎందుకు కొంత మేరకు మాత్రమే ఇస్తున్నారు? విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ ఎందుకు నిలిచి పోయింది? జాబ్ క్యాలెండర్ ఎక్కడ అని పోలాడి ప్రశ్నించారు. నామ మాత్రంగానే ఓసి కార్పొరేషన్లు ప్రకటించిన ప్రభుత్వం వాటికి పాలక మండలి ఏర్పాటు చేయకుండా చట్ట బద్ధత కల్పించక నిదులు ఎందుకు కేటాయించలేదు?
గతంలో ఉన్న పాల ఉత్పత్తి దారులకు లీటరుకు 4 రూపాయల రాయితీ ఎందుకు నిలిపి వేశారు?
.50 ఏళ్లు నిండిన రైతులకు నెలకు ఆరు వేల రూపాయల పెన్షన్ సౌకర్యం ఎప్పుడు అని పోలాడి ప్రశ్నల వర్షం కురిపించారు. రైతులను నిలువు దోపిడి చేస్తున్న ప్రైవేట్ సీడ్ కంపెనీల యాజమానుల ఆగడాలను ఎందుకు అరికట్టడం లేదు?. ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతుల పంటలను పూర్తిగా ఎందుకు కొనుగోళ్లు చేయడం లేదు? గ్రామీణ ప్రాంతాలలో కూలీల కొరత ఖర్చుల పెరుగుదల నేపథ్యంలో ఉపాధి హామీ పథకం తో వ్యవసాయ రంగాన్ని అనుసంధానం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మీన మేషాలు లెక్కిస్తుంది? ఇచ్చిన హామీల మేరకు జాబ్ క్యాలెండర్ ఎక్కడ ? యువతకు ఉద్యోగాలు ఎప్పుడు కల్పిస్తారు! ఆర్ధికంగా వెనుకబడిన ఓసి ల సంక్షేమం కోసం కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేస్తారని పోలాడి రామారావు సూటిగా ప్రశ్నించారు.
ఈ డిమాండ్ల సాధనకోసం ఏప్రిల్ 28న కరీంనగర్ లో రైతు ప్రజాసంఘాల ఐకాస ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త రైతుల మహా గర్జన సమర భేరి సభను పార్టీల కతీతంగా చారిత్రాత్మకంగా నిర్వహిస్తామని ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచే 50 వేల మంది ఉమ్మడి వరంగల్ జిల్లాలనుంచి 20 వేల మంది ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి 15 వేల మంది ఉమ్మడి నిజామా బాద్ 10వేలు ఉమ్మడి అదిలాబాద్ జిల్లాల నుంచి 5వేలు తరలి వస్తున్నారని సభకు 30 వేల మంది మహిళలలు 10 వేల మంది యువత తరలి వస్తున్నారని ఇతర జిల్లాల నుంచి లక్షకు పైగా స్వచ్ఛందంగా వాహనాలు ఏర్పాటు చేసుకొని సభకు హాజరు కానున్నట్లు మొత్తంగా రెండు లక్షల మందికి తగ్గకుండా వస్తున్నారని, కరీంనగర్ జిల్లా మానకొండూర్ చొప్పదండి హుస్నాబాద్ హుజురాబాద్ నియోజక వర్గాల నుంచి 800 ట్రాక్టర్ల తో మిగతా వారు 1500 బస్సులో ఇతర వాహనాల ద్వారా సభకు రావడానికి ఎక్కడికక్కడ సమన్వయ కమిటీ తరపున శరవేగంగా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు, రాష్ట్ర వ్యాప్తంగాపార్టీల కతీతంగా భారీ ఎత్తున తరలి వచ్చి మహాగర్జన సభను విజయవంతం చేయాలని పోలాడి రామారావు కోరారు.
ఈ కార్యక్రమంలో రామారావు వెంట ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర నాయకులు నరసింహారెడ్డి, భిక్షపతి, సురేందర్ రెడ్డి, సదానందం, మహేష్ బాబు, రాంబాబు తదిర ప్రజా సంఘాల జేఏసీ నాయకులు పాల్గొన్నారు.







