
—పేదలకు అందించే వైద్యం,విద్య విషయంలో ముందుంటాం…
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: పేదలకు వైద్యం అందించడంలో ముందుండే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా ముందుకు వెళ్తుంది.ఇప్పటికే జమ్మికుంట(15), హుజురాబాద్ (15) ప్రభుత్వ ఆసుపత్రులకు కలిపి 30లక్షలు కేటాయించగా, తాజాగా హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని జమ్మికుంట, కమలాపూర్ దవాఖానలో డయాలసిస్ సెంటర్ లను మంజూరు చేసింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ నుండి అధికారిక ఉత్తర్వులు వెల్లడయ్యాయి.ఇక్కడ డయాలసిస్ సెంటర్ లు కావాలని పేదలు డయాలసిస్ చేసుకోవడానికి ఇతర ప్రాంతాలకు వెళ్లడం ఇబ్బంది అవుతుందని రోగులు వొడితల ప్రణవ్ కు విన్నవించగా, దీన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కు హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ ఈ విషయమై పలుమార్లు దృష్టికి తీసుకుళ్ళగా,దానికి సానుకూలంగా స్పందించిన మంత్రి డయాలసిస్ సెంటర్లు మంజూరు చేశారు. దీనిపై హర్షం వ్యక్తం చేశారు ప్రణవ్, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు, జిల్లా మంత్రులు, ఇంచార్జి మంత్రులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. పేదలకు అందించే వైద్య,విద్య విషయంలో ముందుంటామని రాబోయే రోజుల్లో మరిన్ని నిధులు తీసుకొచ్చి అన్ని విధాల అభివృద్ధి చేస్తామని తెలిపారు.









