
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ప్రజా ఆరోగ్యానికి నష్టం కలిగించే డంపింగ్ యార్డ్ రద్దుకు ప్రభుత్వం ఎందుకు ఆలస్యం చేస్తుందని హుజురాబాద్ మండలం జూపాక గ్రామానికి చెందిన మహిళలు నినదించారు. గురువారం హుజురాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద డంపింగ్ యార్డ్ వ్యతిరేక అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన దీక్షలో సర్పంచ్ స్వప్న ఆధ్వర్యంలో మహిళలు గ్రామస్తులు నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ప్రజల ఆరోగ్యం పాడవుతుందని, డంపింగ్ యార్డ్ వల్ల వాయు కాలుష్యం నీటి కాలుష్యం శబ్ద కాలుష్యం వల్ల ప్రజలు నష్టపోతారని తెలిసి ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదో అర్థం కావడం లేదన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు వ్యతిరేకమైన కార్యక్రమాలు చేపట్టకూడదని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జూపాక గ్రామస్తులతో పాటు అఖిలపక్ష నాయకులు ఈశ్వర్ రెడ్డి, రత్నం, జైపాల్ రెడ్డి, కొండల్ రెడ్డి, హనుమంతరావు, ఎల్లయ్య, సమ్మయ్య, లక్ష్మణమూర్తి, వెంకన్న, జనార్ధన్, వెంకట్రావు, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న పీఏసిఎస్ చైర్మన్ మాజీ కొండల్ రెడ్డి


దీక్షలో పాల్గొన్న గ్రామస్థులు





