
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఈనెల 25వ తారీకు నాడు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు “కల్వకుంట్ల కవితక్క” హైదరాబాదులో నూతనంగా రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్న సందర్భంగా చలో హైదరాబాద్ అనే వాల్ పోస్టర్ను “హుజూరాబాద్ నియోజకవర్గం జాగృతి కన్వీనర్ సంతోష్ కుమార్” ఆధ్వర్యంలో వాల్ పోస్టర్ ను జాగృతి ముఖ్యనాయకుల సమక్షంలో ఆవిష్కరించారు.ఛలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సంతోష్ కుమార్ పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు కొరపల్లి సురేష్, బండ అశోక్, రొంటాల రాజ్ కుమార్, బింగి కార్తీక్, ఊసకోయిల సాయిచరణ్, తాటిపాముల సతీష్, ఇతర నాయకులు పాల్గొన్నారు. అలాగే నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో గోడలకు వాటిని అతికించడం జరిగింది.

చలో హైదరాబాద్ వాల్ పోస్టర్ ను ఆవిష్కతీస్తున్న జాగృతి నేతలు


గోడలకు వాల్ పోస్టర్ ను అతికిస్తున్న నాయకులు





