
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్:
రైతుల ధాన్యపు కేంద్రాలను నిన్న ఆర్భాటంగా ప్రచార యావతో ప్రారంభించిన ప్రభుత్వం ఎక్కడా
ధాన్యపు కొనుగోళ్లు జరప కుండా నిర్లక్ష్యం చేయడం దారునమణి రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు మండిపడ్డారు.


గురువారం కరీంనగర్ రూరల్ మండల పరిధిలోని చెర్లబూత్కూర్, ముగ్దూంపూర్, దుర్షేడ్, ఇరుకుళ్ల, చామనపల్లి గ్రామాల్లో పోలాడి రామారావు నాయకులతో కలిసి పర్యటించి రైతుల ధాన్యపు కళ్ళాలను పరిశీలించి ఆయా గ్రామాల రైతులతో సమావేశమై రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 28న కరీంనగర్ జిల్లా కేంద్రంలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిర్వహించే రాష్ట్రస్థాయి రైతుల మహా గర్జన సమర భేరి సభకు రావాలని కోరుతూ ఆయా గ్రామాల ప్రజలను ఆహ్వానించి రామారావు మాట్లాడుతూ మహా గర్జన సమర భేరి సభతో బెంబేలెత్తిన ప్రభుత్వం రైతులను మభ్య పెట్టడానికి ఆర్భాటంగా ప్రచార యావతో అట్టహాసంగా కొనుగోలు కేంద్రాల ను ప్రారంభించి ఎలాంటి కొనుగోళ్లు నేటికీ ప్రారంభించక పోవడంతో అకాల వర్షపు జల్లులు కురవడంతో రైతులు ఎండిన ధాన్యాన్ని కప్పు కోవడానికి ఎలాంటి టార్పాలిన్ షీట్లు పరదాలు అధికారులు ఏర్పాటు చేయక పోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రామారావు ఆరోపించారు. అధికారులను సమన్వయం చేసే మంత్రులు ఎక్కడ మొద్దు నిద్ర లో ఉన్నారని రామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నదాతలను ఆడుకోవడంలో అలసత్వం పనికి రాదన్నారు వారి ఉసురు తగలక తప్పదన్నారు.


తక్షణమే రైతుల సమస్యలు పరిష్కరించాలని పోలాడి రామారావు డిమాండ్ చేశారు. ఇప్పటికే రెండు సార్లు రైతు భరోసా నిధులను ఎగ్గొట్టినసర్కార్ ఎకరానికి ఒక సారి మరో ఎకరానికి మరోసారి ఇలా విడుతల వారీగా విడుదల చేస్తూ రైతులను మభట్టడం కాకుండా పంటల సాగు సమయంలోనే ఓకె విడుతలో విడుదల చేయాలని పోలాడి రామారావు డిమాండ్ చేశారు. గతంలో పాల ఉత్పత్తి దారులకు లీటరుకు రూ. నాలుగు రూపాయలు ఇచ్చిన రాయితీని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఉద్యార్థులకు ఫీజ్ రీయింబర్స్ మెంట్ నిధుల విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఓసి కార్పొరేషన్ లకు పాలక మండల్లు ఏర్పాటు చేసి ప్రత్యేక నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించి యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. హామీల మేరకు అన్ని రకాల పంటలకు 500రూపాయల బోనస్ ఇవ్వకుండా కేవలం సన్న రకాలకు మాత్రమే పరిమితం చేయడం సరి కాదన్నారు. ఓ పరిశ్రమ యజమాని తయారు చేసిన వస్తువుకు ధర నిర్ణయిస్తున్నాడని అదే రైతు ఆరు గాలం కష్ట పడి పండించిన పంటలకు మాత్రం ధర నిర్ణయించుకునే హక్కు లేకపోవడం ఆవేదన కలిగిస్తోందన్నారు. రైతు భీమా వయోపరిమితిని 59ఏళ్ల నుంచి 70ఏళ్లకు పెంచాలని, 50ఏళ్లు నిండిన ప్రతి రైతుకు నెలకు రూ. ఆరు వేల రూపాయల పెన్షన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. రైతుల న్యాయమైన డిమాండ్ల సాధనకు వివిధ సామాజిక వర్గాల సమస్యల పరిష్కారానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకు వెళ్ళడమే లక్ష్యంగా ఓసి ఐకాస, రైతు ప్రజాసంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో కరీంనగర్ లో లక్షలాది మందితో రాష్ట్రస్థాయి రైతుల మహా గర్జన సమర భేరి సభను నిర్వహిస్తున్నట్లు పోలాడి రామారావు వెల్లడించారు.

రైతులను వివరాలు అడిగి తెలుసుకుంటున్న జాతీయ అధ్యక్షుడు రామారావు..

రైతులను ఉద్దేశించి మాట్లాడుతున్న జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..
ఈ కార్యక్రమంలో చెర్ల బూత్కూర్ మాజీ సర్పంచ్ కవ్వంపల్లి ఆంజనేయులు, రైతు ప్రజాసంఘాల ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ఏనుగు మల్లారెడ్డి, నాయకులు దబ్బేట రమణారెడ్డి, సిహెచ్ శోభాదేవి, బల్మూరి సువర్ణ, పోల్సాని దేవేందర్ రావు, రమేష్ తదితరులు ఉన్నారు.





