
—డంపింగ్ యార్డ్ వల్ల ప్రజల ఆరోగ్యాలపై , పర్యావరణం పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం…
—ప్రభుత్వం సమస్యలు పరిష్కరించాలి కానీ సమస్యలు సృష్టించకూడదు…
—బిజెపి శాసనమండలి సభ్యులు అంజిరెడ్డి
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మండలం సిర్సపల్లి శివారులో దాదాపు 125 ఎకరాలలో నాలుగు జిల్లాలకు సంబంధించిన చెత్తను ఇక్కడ డంపింగ్ చేయడానికి యార్డు ఏర్పాటు చేస్తే, చుట్టుపక్క గ్రామాలు, హుజురాబాద్ ప్రజలకు, ఈ ప్రాంత భవిష్యత్తుకు తీవ్ర ప్రమాదం వాటిల్లుతుందని, ప్రభుత్వం నాలుగు జిల్లాల చెత్తతో ఇక్కడ డంపింగ్ యార్డును ఏర్పాటు చేసి హుజురాబాద్ భవిష్యత్తును బొంద పెడతారా అని బిజెపి శాసనమండలి సభ్యులు అంజిరెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు. గురువారం రోజున బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, హుజురాబాద్ బిజెపి నేతలతో కలిసి ఎమ్మెల్సీ అంజిరెడ్డి డంపింగ్ యార్డ్ స్థలాన్ని సందర్శించారు.



ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డంపింగ్ యార్డ్ ఏర్పాటు విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం సరికాదని, ప్రజల అభీష్టానికి అనుగుణంగా పనిచేయాల్సిన ప్రభుత్వం తమకు తోచినట్టు వ్యవహరించడం మంచి పద్ధతి కాదన్నారు. నాలుగు జిల్లాల చెత్తను తీసుకొచ్చి ఒక్క ప్రాంతంలో వేస్తే ఇక్కడి ప్రజల పరిస్థితి ఏంటి.? వాళ్లు ఎలా జీవిస్తారు..? వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతుల పరిస్థితి ఏంటి..? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం డంపింగ్ యార్డ్ ఏర్పాటు విషయంలో మొండిగా నిర్ణయం తీసుకొని ఇక్కడి ప్రాంతంలో యార్డ్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టడం భావ్యం కాదన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ, కీడు, హాని తలపెట్టే కార్యక్రమాలు చేపట్టవద్దన్నారు. ప్రశాంతంగా ఉన్న హుజురాబాద్ ప్రాంత ప్రజలను బాధ పెడుతుందన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం సమస్యలను సృష్టించడం సరికాదన్నారు.. డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తామనే ప్రకటన, నిర్ణయంతో హుజురాబాద్ ప్రాంతంలో నెల రోజులుగా గందరగోళ పరిస్థితులు వచ్చాయన్నారు. డంపింగ్ యార్డ్ ఏర్పాటు వద్దని నెల రోజులుగా ప్రజలు ఆందోళలు నిరసన కార్యక్రమాలు, రిలే నిరాహార దీక్షలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా మొండి వైఖరి తోనే ఉండడం సరికాదన్నారు.. ప్రజలంతా ఒక్కటై, అన్ని పార్టీలు ,అన్ని సంఘాలు ఒక్కటై జేఏసీగా ఏర్పడి ముక్తకంఠంతో నినదించిన ప్రభుత్వం స్పందించకపోవడం దారుణం అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికైనా మొండి వైఖరిని మార్చుకొని ,డంపింగ్ యార్డ్ ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, డంపింగ్ యార్డ్ రద్దు ప్రకటన చేయాలన్నారు. విత్తన కేంద్రంగా ఉన్న ఈ హుజురాబాద్ ఏరియాలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడం ఏంటి? అని ప్రశ్నించారు.

మీడియాతో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ అంజిరెడ్డి
ఈ కార్యక్రమంలో బిజెపి హుజురాబాద్ పట్టణ, మండల అధ్యక్షులు, తుర్పాటి రాజు, పారిపెల్లి కొండాల్ రెడ్డి, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకట్ రెడ్డి, ఇళ్ళంతకుంట మండల అధ్యక్షులు బైరెడ్డి రమణారెడ్డి, కౌన్సిలర్స్ మొలుగురి సుమలత, పంజాల మనోజ్, దామేర అనూష, తూర్పాటి లక్ష్మీ దుర్గ, కొండ ప్రశాంతి, కందుగుల సర్పంచ్ ముప్పు మహేష్, బిజెపి సీనియర్ నాయకులు పైల్ల వెంకట్ రెడ్డి గంగిశెట్టి ప్రభాకర్, తూముల శ్రీనివాస్, నరాల రాజశేఖర్, తిప్పబతిని రాజు, యాంశాని శశిధర్, సబ్బని రమేష్, అనురాగ్, మంచికట్ల మురళీ, పడారి సుమన్, గంట సంపత్, కొలిపాక వెంకటేష్, ఇనుగొండ తిరుపతిరెడ్డి, వెంకట్రావు, బైరెడి సంపత్ రెడ్డి, సహదేవ్, క్యాస వెంకటేష్, ఎర్ర శ్రీదర్, నల్ల అజయ్, పడ్తం విజయ్, నగేష్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.





