
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: గత 32 రోజులుగా డంపింగ్ యార్డ్ రద్దు కోసం ప్రజలు నిరసన తెలుపుతున్న ప్రభుత్వం స్పందించకపోవడం పట్ల అఖిలపక్ష నాయకులు హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్ద కళ్ళకు నల్ల రిబ్బన్లు కట్టుకొని, నల్ల బెలూన్లు చూపుతూ నిరసన తెలిపారు.


ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. హుజురాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయతలపెట్టిన డంపింగ్ యార్డ్ వల్ల ఒక్క హుజురాబాద్ మాత్రమే కాకుండా 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాలు సైతం ఇబ్బందులు పడతారని అన్నారు. డంపింగ్ యార్డ్ వల్ల వాయు కాలుష్యం నీటి కాలుష్యం శ్రద్ధ కాలుష్యం అవుతాయని చెప్పారు. పర్యావరణం దెబ్బతినడంతో ప్రజలు అనారోగ్యము పాలవుతారని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లే డంపింగ్ యార్డ్ ఏర్పాట్ ను ప్రభుత్వం మానుకోవాలని సూచించారు. ప్రజల ఆకాంక్షను గుర్తించి డంపింగ్ యార్డ్ ఏర్పాటుపై ప్రభుత్వం పునరాలోచించి రద్దు చేయాలని కోరారు. అనంతరం ర్యాలీగా వెళ్లి తాసిల్దార్ కు వినతిపత్రం అందజేశారు.

ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు పి ఈశ్వర్ రెడ్డి, ఎడ్ల విజయ్ కుమార్, కొలిపాక సమ్మయ్య, ఎల్లయ్య, వేల్పుల ప్రభాకర్, తునికి సమ్మయ్య, టి వెంకట్రావు, మార్త రవీందర్, లక్ష్మణమూర్తి, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.





