
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజూరాబాద్ పట్టణంలోని స్థానిక విజ్ఞాన్ నెక్స్ట్ జెన్ పాఠశాలలో గురువారం రోజున గ్రాడ్యుయేషన్ డే జరుపుకున్నారని పాఠశాల కరస్పాండెంట్ దాసరి కోటేశ్వర్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలకు ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖ అధికారి విడపు శ్రీనివాస్, అతిథులు ట్రస్మా జిల్లా అధ్యక్షులు కోరెం సంజీవరెడ్డి, రిటైర్డ్ ఉపాధ్యాయుడు గంజి జయవర్ధన్ మరియు లీడ్ స్టేట్ కో ఆర్డినేటర్ వరలక్ష్మి, మేనేజర్ ఐశ్వర్య హాజరైనారు.

ఈ సందర్భంగా ఎంఈఓ విడపు శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు చిన్ననాటి నుండి క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యషించాలని సూచించారు. తల్లిదండ్రులు పిల్లల విద్యా ప్రమాణాలకు అనుగుణంగా సహకరిస్తూ, మొబైల్ వాడకాన్ని తగ్గించే విధంగా జాగ్రత్త వహించాలన్నారు. విద్యార్థులకు చిన్నతనంలోనే గ్రాడ్యుయేషన్ డే జరపడం అనేది ఒక మరిచిపోలేని గొప్ప గుర్తింపు అని, వేసవి సెలవుల్లో పిల్లల అభివృద్ధికి తగినట్లు ఆటపాటలలో ప్రోత్సహించాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

తదనంతరం పాఠశాల కరస్పాండెంట్ దాసరి కోటేశ్వర్ మాట్లాడుతూ విజ్ఞాన్ పాఠశాలలో లీడ్ కరికులం అనుసంధానంగా ఇలాంటి ఆక్టివిటీస్ ప్రతి సంవత్సరం జరుపుతామని లర్నింగ్ బై డూయింగ్ పద్ధతి వలన పిల్లలు అవగాహనతో ఉత్సాహంగా నేర్చుకుంటున్నారని తెలిపారు. తద్వారా లీడ్ జాతీయ ప్రతిభ శిక్ష అవార్డ్ లభించడం మా పాఠశాల ఉపాధ్యాయుల కృషి మరియు విద్యార్థుల విద్యా నైపుణ్యలకు గుర్తింపని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కిండర్ గార్టెన్ పిల్లలు చేసిన ఆక్టివిటీస్, రైమ్స్, డాన్సులు అందరినీ అలరించాయి.
అనంతరం ప్రతిభ కనబరిచిన విద్యార్థులందరిని అతిథులందరూ అభినందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో డైరెక్టర్ దాసరి తిరుపతియాదవ్, కో ఆర్డినేటర్ సుమలత, ఉపాధ్యాయులు, విద్యార్థులు, అధిక సంఖ్యలో తల్లిదండ్రులు పాల్గొన్నారు.

అలరించిన చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు..



గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా సర్టిఫికెట్లతో చిన్నారులు

వేడుకలను తిలకిస్తున్న విద్యార్థులు, తల్లిదండ్రులు..






