
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: వడదెబ్బ (హీట్ స్ట్రోక్) నివారణపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు హుజురాబాద్ పట్టణంలోనీ మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం ప్రత్యేక పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రొంటాల సుహాసిని, డిప్యూటీ డిఏం హెచ్ ఓ డాక్టర్ గొట్టే శ్రావణ్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతల వల్ల వడదెబ్బ ప్రమాదం పెరుగుతుందని, ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లకుండా ఉండటం, తగినంత నీరు తాగడం, తలపై రక్షణగా టోపీ లేదా గుడ్డ వాడడం, తేలికపాటి ఆహారం తీసుకోవడం వంటి సూచనలు చేశారు. కాంగ్రెస్ నాయకుడు కోయల్ కార్ బాలాజీ మాట్లాడుతూ..మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు మరింత విస్తృతంగా నిర్వహించేలా కృషి చేస్తామని తెలిపారు. సి హెచ్ ఓ, హెచ్ ఈ, సిబ్బంది కూడా ప్రజలకు ఇంటింటికి వెళ్లి వడదెబ్బ నివారణపై సూచనలు అందిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ భూపాల్ రెడ్డి, ఆర్ ఐ రమేష్, బల్దియా సిబ్బంది, ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

వడదెబ్బపై ప్రభుత్వము అవగాహన కల్పించే వాల్పోస్టర్..





