
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: రైతు వ్యతిరేక విధానలకు నిరసనగా, వివిధ సామాజిక వర్గాల అభ్యున్నతి కోసం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ రైతు ప్రజాసంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించే రాష్ట్ర స్థాయి రైతుల మహా గర్జన సమర భేరి సభను ఈనెల 28కి బదులు వచ్చే నెల మే 30న నిర్వహించడానికి రాష్ట్ర, జాతీయ రైతు ప్రజాసంఘాల సమాఖ్య సమావేశం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది.
రైతుల పంటల వరి కోతలు పూర్తి కానందున వారి విజ్ఞప్తి మేరకు, విద్యార్థులు, వివిధ సామాజిక వర్గాల విన్నపం మేరకు రైతుల మహాగర్జన సమరభేరి సభను అనివార్య కారణాల వలన ఈ నెల 28కి బదులుగా వచ్చే మేనెల 30న నిర్వహించ తలపెట్టినట్లు శనివారం కరీంనగర్ లోని హోటల్ శ్రీనివాస్ లో జాతీయ, రాష్ట్ర , వివిధ జిల్లాల రైతు ప్రజాసంఘాల నాయకులతో నిర్వహించిన ప్రత్యెక సమావేషంలో నిర్ణయించినట్లు ఐకాస జాతీయ రాష్ట్ర నేతలు తెలిపారు. ఈ సందర్భంగా రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రథాన కార్యదర్శి సంధి తిరుపతిరెడ్డిలు మాట్లాడుతూ ధాన్యపు కొనుగోలు కేంద్రాలను ఆర్భాటంగా ఏర్పాటు చేసి ఎలాంటి కొనుగోళ్లు జరపడం లేదని దీంతో అకాల వర్షాల నేపథ్యం లో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కనీసం వారికి టార్పాలిన్ షీట్ కవర్ లు, గన్నీ బాగులు సరఫరా చేయడం లేదని దీంతో ప్రైవేట్ దళారుల కు రైతులు తక్కువ ధరకు ధాన్యాన్ని అమ్ముకోవాల్సి న దుస్థితి దాపురించిందని ఇందుకు ప్రభుత్వ పెద్దలు ప్రైవేట్ వ్యక్తుల మధ్య కుదిరిన బేర సారాల లోపాయికారీ ఒప్పందమే నని చర్చించుకుంటున్నారని ఆరోపించారు. క్వింటాల్ కు తాలు మట్టిలేని ఆరబెట్టి ఎండిన ధాన్యానికి 6 కిలోల ధాన్యాన్ని అదనంగా రైతుల నుంచి తీసుకుంటున్నారని మండి పడ్డారు. కొన్ని చోట్ల ఇప్పటికే 60శాతం ధాన్యాన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయిందని కావాలనే ఆలస్యంగా ప్రైవేట్ వ్యక్తుల కు మేలు చేసేందుకే ధాన్యపు కొనుగోలు కేంద్రాలను ఆలస్యంగా ఏర్పాటు చేసి కొనుగులు జరపడం లేదని దీంతో రైతులు నిలువు దోపిడికి గురవుతున్నారని ఆరోపించారు.

మాట్లాడుతున్న ఓసి జెఎసి జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..
రైతు బంధు నిదులు పంట కోతల దశలో అర కొర గా వేస్తూ మోసం చేయడం దారుణమన్నారు.
పాలకులు రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రూ. ఋణ మాఫీ 30 శాతం మంది రైతులకే జరిగిందని మిగతా 70 శాతం మంది కి వెంటనే మాఫీ చేయాలని డిమాండ్ చేశారు.కౌలు రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో నిర్లక్ష్య వైఖరి విడనాడి వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే రెండు సార్లు భరోసా నిధులను ఎగ్గొట్టిన సర్కార్ రైతు భరోసా నిధులను పంటల సాగు సమయంలోనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గతంలో పాల ఉత్పత్తి దారులకు లీటరుకు 4 రూపాయలు ఇచ్చిన రాయితీని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ నిధుల విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వివిధ సామాజిక వర్గాల కార్పొరేషన్లకు పాలక మండల్లు ఏర్పాటు చేసి ప్రత్యేక నిధులను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించి యువతకు ఉద్యోగా వకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన
హామీల మేరకు అన్ని రకాల పంటలకు 500 రూపాయల బోనస్ ఇవ్వకుండా కేవలం సన్న రకలకే పరిమితం చేయడం సరి కాదన్నారు. ఓ పరిశ్రమ యజమాని తయారు చేసిన వస్తువుకు ధర నిర్ణయిస్తున్నాడని అదే రైతు ఆరు గాలం కష్ట పడి పండించిన పంటలకు మాత్రం ధర నిర్ణయించుకునే హక్కు లేకపోవడం ఆవేదన కలిగిస్తోందన్నారు. రైతు భీమా వయోపరిమితిని 59 ఏళ్ల నుంచి 70 ఏళ్లకు పెంచాలని, 50 ఏళ్లు నిండిన ప్రతి రైతుకు నెలకు రూ ఆరు వేల రూపాయల పెన్షన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. రైతుల న్యాయమైన డిమాండ్లను ఇతర సామాజిక వర్గాల సమస్యల పరిష్కారానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లడమే లక్ష్యంగా రైతు ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మే 30న కరీంనగర్ లో రెండు లక్షల మందితో రాష్ట్ర స్థాయి రైతుల మహా గర్జన సమర భేరి సభను నిర్వహిస్తున్నట్లు పోలాడి రామారావు, సంధి తిరుపతిరెడ్డిలు వెల్లడించారు.


ఈ సమావేశంలో ప్రజా సంఘాల జాతీయ సలహాదారు పెండ్యాల కేశవరెడ్డి, ఉత్తర తెలంగాణ జిల్లాల అధ్యక్షుడు పెండ్యాల రాంరెడ్డి, రాష్ట్ర, జిల్లాల నాయకులు బండ గోపాల్ రెడ్డి, చెన్నమనేని పురుషోత్తంరావు, చేకూరి అశోక్, రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ రావుల కిరణ్ రెడ్డి, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు జున్నూతుల రాజిరెడ్డి, ఉమ్మడి జిల్లాల నాయకులు కర్ర అశోక్ రెడ్డి, కాంతాల సత్యనారాయణరెడ్డి, తాళ్ళపల్లి రమేష్, రాఘవరెడ్డి తదితర ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

అభివాదం చేస్తున్న ఓసి జేఏసీ జాతీయ, రాష్ట్ర, జిల్లాల ముఖ్య నాయకులు..





