
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్లో కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని మరోసారి చాటుకుంది. మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుల ఎంపికలో నాలుగుకు నాలుగు స్థానాలను దక్కించుకుని సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. హుజురాబాద్ చరిత్రలో తొలిసారిగా మున్సిపల్ వ్యవహారాల్లో కాంగ్రెస్ పార్టీ ఈ స్థాయి ప్రభావాన్ని చూపడం గమనార్హం. పార్టీని నమ్ముకుని పనిచేసిన వారికి ప్రాధాన్యం ఇస్తూ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ బాబు సమతుల్యంగా ఎంపికలు జరిపారు. బీసీ, ఎస్సీ, మైనారిటీ వర్గాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించడంతో పాటు మహిళలకు రెండు స్థానాలు కేటాయించడం విశేషం. ఈ కో-ఆప్షన్ సభ్యులుగా గొట్టే జమదగ్ని, మహమ్మద్ అబ్దుల్ అలీం, ఆలేటి సుశీల, ఫరీద బేగం ఎంపికయ్యారు. ఈ ప్రక్రియను విజయవంతంగా ముందుండి నడిపించిన వొడితల ప్రణవ్ బాబు పాత్ర కీలకంగా నిలిచింది. ఈ విజయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, జిల్లా మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, ఇంచార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం తదితరుల సహకారం ఎంతో ఉందని నాయకులు పేర్కొన్నారు. వీరందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కాగా వీరితో మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ పదవీ బాధ్యతల ప్రమాణ స్వీకారం చేయించారు. ఇందులో మున్సిపల్ చైర్ పర్సన్ సుహాసిని, వైస్ చైర్ పర్సన్ గూడూరి అంజలి, మేనేజర్ భూపాల్ రెడ్డి, కౌన్సిలర్లు పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.

నూతన కో ఆప్షన్ సభ్యులతో ప్రణవ్ …

కో-ఆప్షన్ సభ్యులుగా గొట్టే జమదగ్నికి నియామక పత్రం అందజేస్తున్న కమిషనర్

మహమ్మద్ అబ్దుల్ అలీంకు…

ఆలేటి సుశీలకు…

ఫరీద బేగంకు నియామక పత్రం అందజేస్తున్న దృశ్యం






