
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: నేడు ప్రకటించిన పదోతరగతి ఫలితాలలో హుజురాబాద్ మండల స్థాయిలో హుజురాబాద్ లోని టెట్రా హెడ్రన్ మోడల్ హైస్కూల్ విద్యార్థిని A సహస్ర – 587 మార్కులతో మండల టాపర్ గా మొదటి స్థానంలో నిలిచింది. అలాగే 577 మార్కులతో సింధూష ద్వితీయ స్థానంలో నిలిచిందన్నారు. టాపర్స్ గా నిలిచిన టెట్రాహెడ్రన్ విద్యార్థిని లను పాఠశాల కరెస్పాండంట్ ముచ్చ నారాయణరెడ్డి, డైరెక్టర్లు తిప్పర్తి రమణరెడ్డి, కోరెo సంజీవరెడ్డి, కేతిరెడ్డి సంపత్ రెడ్డి, మాడ రాజిరెడ్డి, సుంకిశాల సంతోష్ రావు మరియు అడ్వైసర్ కడవెరుగు సత్యనారాయణ, ప్రిన్సిపాల్ నరేష్, ఉపాధ్యాయ బృందం మరియు తల్లిదండ్రులు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. కాగా తమ పాఠశాల నుండి 72 మందికి గాను 56 మందికి 500లకు పైగా మార్కులు సాధించి అత్యంత ప్రతిభ కనబరిచారన్నారు. అంతేగాక పాఠశాల విద్యార్థులు మొత్తం 100కు 100% ఉత్తీర్ణత సాధించారనీ వారు సంతోషం వ్యక్తం చేశారు. అత్యంత ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు స్వీట్స్ తినిపించి అభినందించారు.

587 మార్కులు సాధించి అత్యంత ప్రతిభ కనబరిచిన ఏ సహస్ర

577 మార్కులు సాధించి ప్రతిభ కనబరిచిన సింధూష





