
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంతోపాటు మండలంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో పదవ తరగతి విద్యార్థులు అత్యంత ప్రతిభ కనబరిచి అద్భుత మార్కులు సాధించారని ఎంఈఓ విడపు శ్రీనివాస్ తెలిపారు. 13 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల నుండి మొత్తం 291 హాజరు కాగా 283 మంది ఉత్తీర్ణులయ్యారు.
ఉత్తీర్ణత శాతం 97.25%. కాగా 4 రెసిడెన్షియల్ పాఠశాలలో మొత్తం 235 హాజరు కాగా 235 మంది ఉత్తీర్ణులయ్యారు. ప్రభుత్వ పాఠశాలల నుండి మొత్తం 526 హాజరు కాగా 518 మంది ఉత్తీర్ణులయ్యారు.11 ప్రైవేట్ పాఠశాలల నుండి 342 హాజరు కాగా 340 మంది ఉత్తీర్ణులయ్యారు.
పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో టెట్రా హెడ్రాన్ పాఠశాల విద్యార్థిని ఏ. సహస్ర 587 మార్కులు మండల ప్రథమ స్థానం, మండల ద్వితీయ స్థానం మాంటిసోరి హై స్కూల్ విద్యార్థి జి రిషి వర్ధన్ 583 మార్కులు సాధించి నిలిచారు.

ZPHS బాలుర కల్లెపు అభినవశ్రీ 571 మార్కులు

గాలిబు చరణ్ 561 మార్కులు

హుజురాబాద్ జిల్లా పరిషత్ సెకండరీ బాలుర పాఠశాల విద్యార్థిని కళ్లెపు అభినయశ్రీ 571 మార్కులు సాధించి ప్రథమ స్థానం, చెల్పూర్ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల విద్యార్థి గాలిబు చరణ్ 561 మార్కులు సాధించి ద్వితీయ స్థానం పొందారు. అలాగే హుజురాబాద్ బాలికల ఉన్నత పాఠశాల 44 విద్యార్థులకు గాను 43 విద్యార్థులు ఉత్తీర్ణత పొంది 97%ఫలితాలు సాధించారు. హుజురాబాద్ కు చెందిన రాయబారపు హరికిషన్ కూతురు లక్ష్మి ప్రియ 559 మార్కులతో పాఠశాల ఫస్ట్ ర్యాంక్, మండల్ థర్డ్ ర్యాంక్ సాధించినది. 544మార్కులతో కోయల్కర్ శ్యామ్ కూతురు కృష్ణమయి పాఠశాల సెకండ్ ర్యాంక్ అలాగే Md సలీం పాషా కూతురు రేష్మ 527 మార్కులతో థర్డ్ ర్యాంక్ సాధించారు. విద్యార్థులు మంచి ఫలితాలు సాధించినందుకు గాను HM బి తిరుమల మరియు ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు.





