
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: తెలంగాణ రాష్ట్రప్రభుత్వం విడుదల చేసిన పదవ తరగతి ఫలితాల్లో హుజురాబాద్ పట్టణంలోని విజ్ఞాన్ నెక్స్ట్ జెన్ పాఠశాల విద్యార్థులు విజయదుందుబి మోగించారు.

ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందిస్తున్న ఎంఈఓ శ్రీనివాస్, పాఠశాల యాజమాన్యం.
ఈ ఫలితాలలో పాఠశాల విద్యార్థినిలు జి. ప్రవళిక 576, కే విహారిక 572, ఎస్ అక్షర 564 మార్కులతో ఉత్తమ ఫలితాలు సాధించగా ఆ విద్యార్థులను మండల విద్యాధికారి విడపు శ్రీనివాస్ అలాగే పాఠశాల కరస్పాండెంట్ దాసరి కోటేశ్వర్ యాదవ్ అభినందించి పూల బొకేలతో ఘనంగా సత్కరించారు. అలాగే కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలతో మొత్తం పాఠశాలలో 18 మందిలో 14 విద్యార్థులు 500 పైగా మార్కులు సాధించి 100% వంద శాతం ఉత్తీర్ణత సాధించడం జరిగిందని పాఠశాల కరస్పాండెంట్ దాసరి కోటేశ్వర్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పాఠశాలకు విచ్చేసి యాజమాన్యానికి మరియు పాఠశాల ఉపాధ్యాయులకు, విద్యార్థులకు అభినందనలు తెలపడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ తిరుపతి యాదవ్, ఉపాధ్యాయులు రమేష్, తిరుపతి, పాషా, రాజేందర్ ఇతర ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఎస్ఎస్సి ఫలితాలలో అత్యంత ప్రతిభ కనబరిచి జి. ప్రవళిక 576 ను పూల బొకే ఇచ్చి అభినందిస్తున్న ఎంఈఓ శ్రీనివాస్

ప్రవళికను అభినందిస్తున్న పాఠశాల యాజమాన్యం..

100% ఉత్తీర్ణత సాధించిన ఎస్ఎస్సి ఆ పాఠశాల విద్యార్థులు..

మేరుగైన ఫలితాలు సాధించిన విద్యార్థులతో పాఠశాల కరస్పాండెంట్ కోటేశ్వర్ యాదవ్





