
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్: విద్యార్థులు ఉన్నతంగా చదివి సమాజ అభివృద్ధికి తోడ్పెడేలా ముందుకు సాగాలని మున్సిపల్ చైర్ పర్సన్ రొంటాల సుహాసిని అన్నారు. బుధవారం పట్టణంలోని మాంటిస్సోరి పాఠశాలలో పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను ఆమె అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు తల్లిదండ్రులకు పేరు తెచ్చేలా మంచి నడవడికతో చదువు కొనసాగించాలని సూచించారు. ఇక్కడి విద్యార్థులు చదువులో రాణించి ఎదిగినప్పుడే కుటుంబంతో పాటు పట్టణానికి పేరు వస్తుందని అన్నారు. అనంతరం పదవ తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన G రిషి వర్ధన్ 583, M నిహాల్ 581, G అభినవ్ 581, మహమ్మదీ బేగం 577, M ప్రణతి 573, K సాన్విత్ 571 లను శాలువాతో అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ షాజూ థామస్, ఉపాధ్యాయులు రమేష్, అజ్మత్ అలీ, అబీద్ పాష, తిరుపతి, రవీందర్, రవీందర్ రావు, తదితరులు పాల్గొన్నారు.

పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను అభినందిస్తున్న మున్సిపల్ చైర్ పర్సన్ సుహాసిని






