
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ డంపింగ్ యార్డును వెంటనే రద్దు చేయండి అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ ముస్లిం ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ తన రక్తముతో శనివారం లేఖ రాసి పంపినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీల నాయకులు కలిసి వచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి హుజురాబాద్ డంపింగ్ యాడ్ సమస్యను తీసుకొని వెళ్లి ఈ సమస్య పరిష్కారం అయ్యేవరకు హుజురాబాద్ ప్రజల వెంట నాయకులు ఉండాలి అని ఆయన అన్నారు. హుజురాబాద్ ప్రజలు ప్రతి నాయకున్ని దగ్గర తీసుకొని ఆ నాయకులకు రాష్ట్రస్థాయిలో వారికి గుర్తింపు వచ్చినట్లు చేసిన ప్రజల వెంట నాయకులు ఉండాలన్నారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్, భారత రాష్ట్ర సమితి హుజురాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి, మాజీ పార్లమెంట్ సభ్యులు, ప్రస్తుత బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ పార్లమెంట్ సభ్యులు బోయిన్ పల్లి వినోద్ కుమార్, మాజీ రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ వి ప్రణవ్ బాబు లాంటి నాయకులందరూ కలిసి డంపింగ్ యార్డ్ రద్దు కొరకు తమ వంతు ప్రయత్నం చేయాలని తెలంగాణ ముస్లిం ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ వీరందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈరోజు తన రక్తముతో లేఖ రాసి వారందరికీ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ రక్తముతో రాసిన లేఖలో ప్రజల ఆరోగ్యానికి ముప్పు ఉంటుందని చెత్త నిలువ చేయటం వలన దుర్వాసన, గాలి కాలుష్యం పెరిగి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ పేర్కొన్నారు. డంపింగ్ యార్డ్ కారణముగా భూగర్భ జలాలు కాలుష్యం అయ్యి త్రాగు నీటి సమస్యలు తలెత్తుతాయని తెలిపారు. అంతేకాకుండా దోమలు, ఈగలు వృద్ధి చెంది అంటూ వ్యాధులు వ్యాప్తి చెందుతాయన్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, గర్భిణీలు, వృద్ధులపై తీవ్ర ప్రభావం ఉంటుందని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఆవేదన వ్యక్తం చేశారు. హుజురాబాద్ ప్రజల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వెంటనే డంపింగ్ యార్డ్ ఏర్పాటు నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలని తన లేఖలో ముజాహిద్ హుస్సేన్ కోరారు.

తన రక్తంతో లేఖ రాసిన తెలంగాణ ముస్లిం ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్

సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులకు రక్తంతో రాసిన లేఖలు..







