Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ సింగిల్ విండో బ్యాంకు చైర్మన్ గా తిరిగి ఎడవల్లి కొండారెడ్డి సోమవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. పాత పాలకవర్గాలే తిరిగి పదవి బాధ్యతలు స్వీకరించాలని హైకోర్టు ఆదేశించడంతో అధికారులు పాత పాలకవర్గాలతో ప్రమాణ స్వీకారాలు చేయించారు. ఇందులో భాగంగా సోమవారం హుజూరాబాద్ సింగిల్ విండో కార్యాలయంలో చైర్మన్ గా ఎడవల్లి కొండాల్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించారు. వారితోపాటు వైస్ చైర్మన్ గా ముద్రబోయిన శంకర్, సభ్యులుగా గూడూరు ప్రభాకర్ రెడ్డి, దండ భాస్కర్ రెడ్డి, జి శ్రీనివాస్, వై సుజాత, బి అనసూయ, పి ఆంజనేయులు, మధుసూదన్ రెడ్డి, రవీందర్, లింగారావు, లోకిని సాయిలు, ఎం లక్ష్మారెడ్డి లు పదవి బాధ్యతలు స్వీకరించారు. కాగా నూతనంగా చైర్మన్ పదవిని అధిష్టించిన ఎడవల్లి కొండాల్ రెడ్డిని, పాలకవర్గాన్ని సింగిల్ విండో ఈవో గోస్కుల వివేకానంద, మేనేజర్ మహేందర్ రెడ్డి, విజయ ఇతర ఉద్యోగులు సన్మానించారు.

పదవీ బాధ్యతలు చేపట్టిన పిఎసిఎస్ చైర్మన్ ఎడవల్లి కొండల్ రెడ్డి, వైస్ చైర్మన్ శంకర్, డైరెక్టర్లు..





