
–కో-ఆప్షన్ సభ్యులుగా నియమింపబడిన గొట్టే జమదగ్ని, ఆలేటి సుశీల, ఎండీ అలీమ్, ఫరీదా బేగం.
–మున్సిపాలిటీకి వన్నె తెచ్చే విధంగా పట్టణంలోని అన్ని వర్గాల ప్రజల సమస్యల పట్ల స్పందించాలి.
–ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల ప్రజా సమస్యల పరిష్కారములో ప్రత్యేక చొరవ చూపాలి.
–బీసీ జేఏసీ గౌరవ అధ్యక్షులు చందుపట్ల జనార్ధన్, అధ్యక్షులు సందేల వెంకన్న.
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ ప్రతినిధి, మే 10: బీసీ జేఏసీ హుజురాబాద్ గౌరవ అధ్యక్షులు చందుపట్ల జనార్ధన్, అధ్యక్షులు సందేల వెంకన్న ఆధ్వర్యంలో పట్టణంలోని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ కార్యాలయంలో హుజురాబాద్ మునిసిపల్ కౌన్సిల్ కో-ఆప్షన్ సభ్యులుగా నియమింపబడిన గొట్టే జమదగ్ని, ఆలేటి సుశీల, ఎండీ అలీమ్, ఫరీదా బేగంలను ఘనంగా సన్మానించారు. అలాగే మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పుల్లా రాధాను సన్మానించారు. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులు చందుపట్ల జనార్ధన్ మాట్లాడుతూ, వీరందరూ మున్సిపల్ కో- ఆప్షన్ సభ్యులుగా ఎన్నిక కావడం పట్ల బీసీ జేఏసీ పక్షాన తమ హృదయ పూర్వక హర్షాన్ని వ్యక్తం చేశారు. హుజురాబాద్ మునిసిపల్ కో- ఆప్షన్ సభ్యులుగా హుజురాబాద్ మున్సిపాలిటీకి వన్నె తెచ్చే విధంగా పట్టణంలోని అన్ని వర్గాల ప్రజల సమస్యల పట్ల స్పందించి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల ప్రజా సమస్యల పరిష్కారములో ప్రత్యేక చొరవ చూపాలని కోరారు. అదే విధంగా ప్రజా ప్రతినిధులకు దీటుగా ప్రజల పక్షాన నిలబడి పేద వర్గాలకు పెన్నిధిగా అండగా నిలుస్తూ అన్ని వర్గాల ప్రజల ఆదరాభి మానాన్ని చూడగానే విధంగా నిరంతరము ప్రజా సమస్యల పక్షాన ప్రజల కొరకు పనిచేసే హుజురాబాద్ మునిసిపాలిటీ కీర్తిని ఆకాశమంత ఎత్తున రెపరెపలాడించాలని ఆకాంక్షించారు.


ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ ప్రధాన కార్యదర్శి చిలుక మారి శ్రీనివాస్, ఏంసి.డైరెక్టర్ బండారి సదానందం, జేఏసీ నాయకులు ఇప్పకాయల సాగర్, మండల వీరస్వామి, దొంత హరికిషన్, దాసరి మల్లేశం, బత్తుల మనోజ్, ఎండి.ఆశు, గాజర్ల బుచ్చి రాజ్యం, తాళ్లపల్లి అమరేందర్, సురేష్ బాబు, పంజాల వెంకటేశ్వర్లు, దిల్ టైలర్ శ్రీనివాస్, కొలిపాక క్రాంతి, జూపాక నరసింహాచారి, పోగు సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.





