
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: సన్ జెమినీ టీవీలో ప్రసారమయ్యే భామలు – సత్యభామలు ఎపిసోడ్ షూటింగ్ హుజురాబాద్ పట్టణంలో మంగళవారం జరిగిన సందర్భంగా మహిళలు సందడి చేశారు. జెమినీ టీవీలో ప్రతివారం ప్రసారమయ్యే భామలు- సత్యభామలు ఎపిసోడ్ షూటింగ్ పట్టణంలోని మహాలక్ష్మి ఫంక్షన్ హాల్ లో జరిగింది. ఈ సందర్భంగా ఎపిసోడ్ యాంకర్ భార్గవ్, మేనేజర్ మనీలు హుజురాబాద్ కు పలువురు మహిళలతో వివిధ రకాల అంశాలను షూట్ చేశారు. వారితో వివిధ గేమ్స్ ఆడించారు. యాంకర్ భార్గవ్ నేర్పరితనంతో మహిళల్లో ఉన్న కళాతృష్ణను బయటికి తీయించారు. ఇంతేకాక పలువురు మహిళలు నృత్యాలు చేశారు.

ఈ కార్యక్రమంలో డాన్స్ మాస్టర్ శ్వేత, హనుమకొండకు చెందిన ఎర్రం గీతలు, సన్ జెమినీ టీవీకి చెందిన ఫోటోగ్రాఫర్లు, డైరెక్టర్లు పాల్గొన్నారు.






