
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హనుమాన్ జయంతి సందర్భంగా హుజురాబాద్ పట్టణంలోని ఆంజనేయస్వామి దేవాలయం, అయ్యప్పస్వామి దేవాలయం, రంగనాయకుల గుట్ట వద్ద గల పాటి మీద ఆంజనేయస్వామి ఆలయాల్లో భక్తిశ్రద్ధలతో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. హనుమాన్ జయంతినీ పురస్కరించుకొని ఆంజనేయస్వామి విగ్రహాలకు ప్రత్యేక అలంకరణలు చేశారు. ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఉదయం 5 గంటల నుంచే మన్య సూక్తాభిషేకం, ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు భక్తులతో కలిసి నిర్వహించారు. అనంతరం అష్టోత్తర శతనామ పూజలు, ఇరుముడి కార్యక్రమాలు, అర్చనలు జరిపారు భక్తులకు అన్న ప్రసాద వితరణ నిర్వహించారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ఆలయాల్లో స్వామివారి దర్శనం కోసం భక్తులు భారీగా రావడంతో ఆలయాలు అన్ని భక్తులతో కిటకిటలాడాయి. స్వామివారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. శ్రీ దాక్షన ముఖ: ఆంజనేయస్వామి అలంకరణ జరిగినది. భూషితుడైనటువంటి అలంకరణ భూశితుడైన హనుమాన్ స్వామికీ వెండి తామార తొరణాలను బహుకరించిన కోమల్ల రాధిక -విజేందర్ రెడ్డి దంపతులు, వారి నాన్న గారైన కొత్త అశోక్ రెడ్డి సరళ దంపతులు, రవీందర్ రెడ్డి, వర్దినేని రవీందర్ రావు, చొక్కారపు యాదగిరి, కుమారస్వామి రాంపూర్, కన్నెన్ దొరయ్ రాజు, గుంటి మాదవి శ్రీనువాస్ దంపతులు, శ్రీ మహా ఘనపతికి వెండి కిరీటం బహుకరించిన బద్దం ముత్యం రెడ్డి శారదా దంపతులకు దేవాలయం కమీటి చిరు సత్కారం చేశారు. అలాగే ఆంజనేయ భక్తులు, అయ్యప్ప భక్తులు, దేవాలయం పురోహితులు ప్రత్యేక అభినందనలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు తిరునగరి తిరుమలేష్, నంద కిషోరస్వామి, భాస్కర్, కిరణ్ కుమార్, కుర్జీ ప్రదీప్, రాహుల్, సుజిత్, ఆలయ చైర్మన్, కౌన్సిలర్ మాజీ చైర్మన్ గందె, శ్రీనివాస్, మాజీ చైర్పర్సన్ గందె రాధిక, కౌన్సిలర్లు వర్దినేని రవీందర్రావు, సoదమల్ల పుణ్య, మాజీ కౌన్సిలర్ ముత్యంరాజు, కొండ్ర జీవిత, పి వెంకట్ రెడ్డి, నాయకులు సందమల్ల బాబు, కొండ్ర నరేష్, నాగార్జున డైరీ అధినేత పుల్లూరి ప్రభాకర్ రావు, కొత్త అశోక్ రెడ్డి, రవీందర్ రెడ్డి, మనోజ్, భూసారపు శంకర్, రమేష్, శ్రీనివాస్, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.


పాటిమీద హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేస్తున్న ఆలయ పూజారి..



పెద్ద ఎత్తున హాజరై పాటిమీది హనుమాన్ ను దర్శించుకుంటున్న భక్తులు..

అందంగా అలంకరించిన తుమ్మనపల్లిలోని పంచముఖ ఆంజనేయ స్వామి

నవగ్రహ, ఆంజనేయ సహిత అయ్యప్పస్వామి దేవాలయంలో ఆంజనేయస్వామికి వెండి కిరీటమిచ్చిన బద్దం ముత్యంరెడ్డి -శారద దంపతులను సత్కరిస్తున్న ఆలయ కమిటీ నిర్వాహకులు..





