
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో మంగళవారం ప్రపంచ నర్సుల దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆసుపత్రిలో పని చేసే నర్సులు కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. సీనియర్ లుగా ఉత్తమ సేవలు అందిస్తున్న నర్సులను ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నల్ల నారాయణరెడ్డి, సర్జన్ డాక్టర్ పి శ్రీకాంత్ రెడ్డి, డాక్టర్ ప్రసాదరావులు శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. ప్రపంచంలో ఆరోగ్య పరిరక్షణ విషయంలో నర్సుల పాత్రను వారు వివరించారు. మనిషి రోగిగా మారినప్పుడు రోగి నుండి మనిషిగా మారడానికి నర్సులు చేస్తున్న సేవలు ఎనలేనివని పలువురు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ నల్ల నారాయణరెడ్డి, డాక్టర్ పి శ్రీకాంత్ రెడ్డి, డాక్టర్ ప్రసాదరావు, సదానందం, పలువురు నర్సులు, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది పాల్గొన్నారు.




అంతర్జాతీయ నర్సుల దినోత్సవం పురస్కరించుకొని కేక్ కట్ చేసి, సీనియర్ నరుసులను సత్కరిస్తున్న వైద్యాధికారులు, వైద్యులు, సిబ్బంది..





